Diet chart Diabetes Patients : మధుమేహం ఇటీవల ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. కొంచెం వయస్సు పెరగ్గానే చాలామంది ఈ వ్యాధి బారిన పడుతూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ వచ్చిందంటే.. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ స్థాయిలను పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అందులో భాగంగా మధుమేహ రోగులు చపాతీలు తినొచ్చా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహం అనగానే చాలామందిలో భయం కలుగుతుంది. ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే ఇక జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. షుగర్ లెవల్స్‌ను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశముంది. డయాబెటిస్ బారిన పడితే శరీరంలో అనేక మార్పులు రావడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
Diabetes Food Plan : మధుమేహ రోగులు రక్తంలోని షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకునేందుకు తప్పనిసరిగా సరైన ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. స్వీట్లతో పాటు షుగర్ లెవల్స్‌ను పెంచే ఆహార పదార్థాలను దూరం పెట్టాలి. షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మనం ఇష్టంగా తినే ఆహారాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
అయితే డైట్ పాటించే చాలామంది రాత్రి చపాతీలు తింటుంటారు. దీని వల్ల బరువు పెరగమని, ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని భావిస్తారు. తేలికగా జీర్ణం అవడం సహా శరీరానికి అనేక పోషక విలువలు లభిస్తాయని చెబుతుంటారు. డిన్నర్‌లో ఆహారం ఎక్కువ తీసుకుంటే జీర్ణ సమస్యలు లాంటివి వస్తూ ఉంటాయి. అందుకే చాలామంది రాత్రి చపాతీలు తింటుంటారు.
మధుమేహులు రాత్రి చపాతీ తినొచ్చా?
Can Diabetics Eat Chapati At Night : చపాతీలు తినొచ్చా? లేదా? అనే అనుమానం చాలామంది డయాబెటిస్ రోగుల్లో ఉంటుంది. చపాతీలు తినడం వల్ల కడుపులో మంటగా ఉంటుందని చాలామంది చెబుతుంటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించి సలహాలు తీసుకోవాలి. చపాతీలు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అల్సర్ లాంటి సమస్యలు ఉండటం వల్లే కడుపులో మంటగా ఉంటుంది. ఎండోస్కోపీ లాంటి టెస్టులు చేయించుకోవడం వల్ల సమస్యను గుర్తించవచ్చు.
ఇన్సులిన్ అవసరం ఎప్పుడు ఉంటుంది..?
Diabetes Insulin Injection : మధుమేహ రోగులు ఎప్పటికప్పుడు షుగర్ స్థాయిలను చెక్ చేసుకోవాలి. దానికి తగట్లు డైట్ పాటించడం, మందులను వాడటం చేయాలి. అవసరమైతే షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకునేందుకు ఇన్సులిన్ ఎక్కించుకోవాలి. ఇన్సులిన్‌ను ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. డాక్టర్‌ను సంప్రదించి భోజనం చేయడానికి ముందు లేదా తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఇన్సులిన్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
Diabetic Patient Diet Chart : మధుమేహ రోగులు సమయానికి ఆహారం తీసుకోవాలి. రోజూ వ్యాయామం లాంటివి చేయాలి. పచ్చి కూరగాయలు, మజ్జిగ, నిమ్మరసం, తృణధాన్యాలు వంటి పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
షుగర్ ఉన్నవారు రాత్రిపూట చపాతీలు తినొచ్చా?