Cancer causes: మనకు రోజూ ఎదురయ్యే పరిస్థితులు... మనం తరచూ చేసే పనులు... మన అలవాట్ల కారణంగా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్టు వింటూ ఉంటాం. అది మన ఆహారం వల్ల కావచ్చు. మన జీవనశైలి వల్ల కావచ్చు. మన ప్రమేయం లేకుండా మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల కూడా కావొచ్చు. అయితే అలాంటి వాటిల్లో నిజమెంతో మనకు తెలియదు. ఏది అపోహ? ఏది శాస్త్రీయంగా రుజువైందనేది కూడా తెలియకుండానే మనం నమ్మేంతగా ఆ ప్రచారాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి.
Does X ray cause Cancer?
క్యాన్సర్ విషయంలో ఎక్కువగా ప్రచారం జరిగేది ఎక్స్‌రేల గురించే. ఎక్స్‌రేలో ఉపయోగించే రేడియేషన్ ఎక్కువైతే క్యాన్సర్‌కు దారి తీయొచ్చని అంటుంటారు. అయితే, ఇది పూర్తిగా అవాస్తవం కాదని నిపుణులు చెబుతున్నారు. పాతకాలంలో ఎక్స్‌రే యంత్రాలు ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేసేవని, ప్రస్తుతం ఆ స్థాయి తగ్గిందని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికీ ఎక్స్‌రేల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరీ ఎక్కువగా ఎక్స్‌రేలు తీయించుకోవద్దని సూచిస్తున్నారు.
సెల్ఫోన్లు?