కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోన్న ఈ సమయంలో ఆరోగ్యంతో పాటు ఎలాంటి భయం లేకుండా పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండడం ఎంతో అవసరమంటున్నారు రుజుత. ముంబయికి చెందిన ఈ ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ డైట్, ఫిట్‌నెస్ టిప్స్ అందిస్తుంటారు. అంతేనా.. కాలానికి తగినట్లుగా పాటించాల్సిన ఆహార నియమాలు, సౌందర్య చిట్కాలు.. ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఎందరికో వెల్‌నెస్ ఎక్స్‌పర్ట్‌గా మారిపోయారామె. ఇక కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో అవసరమంటున్నారు. ఈ క్రమంలోనే వీక్లీ డైట్, ఫిట్‌నెస్ ప్లాన్‌ని ఛార్ట్ రూపంలో పొందుపరిచి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు రుజుత.
ఈ డైట్ ప్లాన్‌లో ఏముందంటే..?
ఉదయం నిద్ర లేచిన తర్వాత తీసుకునే ఫస్ట్ మీల్ దగ్గర్నుంచి రాత్రి పడుకునే ముందు తీసుకునే డిన్నర్ వరకు ఏయే సమయాల్లో ఏయే ఆహారం తీసుకోవాలో, రోజూ ఎలాంటి వ్యాయామాలు చేయాలో తన ప్లాన్‌లో భాగంగా వివరించారు రుజుత. ఈ నేపథ్యంలో ఒక్కో రోజుకు సంబంధించిన డైట్ ఛార్ట్‌ని విడివిడిగా పరిశీలిస్తే..
మొదటి రోజు:
- వ్యాయామం - 5 రౌండ్ల సూర్య నమస్కారాలు
- నిద్ర లేవగానే - నానబెట్టిన బాదం పప్పులు, ఎండుద్రాక్ష
- బ్రేక్‌ఫాస్ట్ - పోహా, పల్లీలు
- మిడ్‌మీల్ - నిమ్మకాయ షర్బత్
- లంచ్ - పప్పన్నం, ఏదైనా పచ్చడి
- మిడ్‌మీల్ (స్నాక్స్) - గుప్పెడు పల్లీలు
- ఎర్లీ డిన్నర్ - శెనగపిండి దోసె
- పడుకునే ముందు - బెల్లం, పసుపు కలిపి తయారుచేసిన ఉండలు
రెండో రోజు:
- వ్యాయామం - సుప్తపదంఘుష్టాసనాలు (3 రౌండ్లు)
- నిద్ర లేవగానే - ఖర్జూరం, వాల్‌నట్
- బ్రేక్‌ఫాస్ట్ - సాంబార్ ఇడ్లీ
- మిడ్‌మీల్ - మిరియాల రసం
- లంచ్ - వాముతో తయారుచేసిన పరాఠాను పెరుగు లేదా ఏదైనా పచ్చడితో కలిపి తీసుకోవాలి.
- మిడ్‌మీల్ (స్నాక్స్) - జీడిపప్పు బెల్లంతో కలిపి తీసుకోవాలి.
- ఎర్లీ డిన్నర్ - కిచిడీ, ఇంట్లో తయారుచేసిన అప్పడాలు
- పడుకునే ముందు - పసుపు, అల్లం పొడి వేసి కాచిన పాలు