మెరుగైన, ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు ఏప్రిల్ 7న అన్ని దేశాలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రజల్లో ఉన్న ఆరోగ్య అసమానతలను పారదోలాలని, ఆ దిశగా ఈ సంవత్సరమంతా జరిపే కార్యాచరణతో నవసమాజాన్ని నిర్మించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తోంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత, జాతి వివక్ష లేకుండా అత్యున్నత ఆరోగ్య స్థాయిని పొందటం ప్రతి మనిషికి ఉన్న ప్రాథమిక హక్కు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజ్యాంగ అధికరణ ప్రకటిస్తోంది.
సంక్షిప్తంగా కొంత చరిత్ర:
ఒక స్వతంత్ర, సంపూర్ణ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ స్థాపించాలని బ్రెజిల్, చైనా దేశాలు డిసెంబర్ 1945లో ప్రతిపాదించాయి. ఆ తరువాత జూలై 1946లో న్యూయార్క్ నగరంలో ఆ ప్రతిపాదన ఆమోదించబడి, ఏప్రిల్7, 1948న 61 దేశాలు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1949, 22 జులై ప్రపంచ ఆరోగ్య దినాన్ని పాటించినా.. తరువాత ఏప్రిల్7ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. ఈ క్రమంలో 1950లో మొదటిసారిగా ప్రపంచ ఆరోగ్య దినాన్ని జరుపుకున్నాం. ఈ దినాన్ని జరుపుకోవటం వెనుక ఉద్దేశ్యం ప్రపంచ ఆరోగ్యాన్ని పీడిస్తున్న సమస్యల గురించి ప్రపంచ ప్రజలందరిలోనూ వ్యాప్తంగా ఒక అవగాహన కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించింది.
ప్రస్తుత ఆరోగ్య గణాంకాలు:
- గత రెండు దశాబ్దాల్లో మొదటి సారిగా ప్రపంచ వ్యాప్తంగా పేదల సంఖ్య పెరుగుతున్నట్టుగా గుర్తించి అది నిలకడ గల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నట్టుగా తెలిసింది.
- కొన్ని దేశాల్లో నివసించే 60% మంది జనాభాకు అత్యవసరమైన ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు.
- సుమారు 100 కోట్లకు పైగా ప్రజలు తాత్కాలిక ఆవాసాల్లో లేదా మురికి వాడల్లో నివసిస్తూ నిత్యం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి లాంటి వాటిని నివారించటం కూడా కష్టమే.
కోవిడ్ వేళ.. ప్రపంచ ఆరోగ్య దినం:
కోవిడ్ మహమ్మారి నియంత్రణలో దేశమంతా మునిగి ఉండగా ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ఈటీవీ భారత్ సుఖీభవ బృందం కొత్త రకాల కరోనా వైరస్ ల గురించి, వాటి వ్యాప్తి గురించి వైద్యులతో చర్చించింది.
ఇండోర్ నగరంలో అపోలో ఆసుపత్రిలో వైద్యుడైనడా. సంజయ్ కె. జైన్, ఎండీకోవిడ్-19 వైరస్ గురించి మాట్లాడుతూ ఈ వైరస్ తరుచూ తన నిర్మాణాన్ని మార్చుకుంటుందని, అది సహజమని దాన్ని ఉత్పరివర్తనం అంటారని చెప్పారు. అందువల్ల మారిన వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతూ తీవ్రమైన నొప్పులు, బొంగురు గొంతు, పొడి దగ్గు, జలుబు లాంటి లక్షణాలను కలుగజేస్తోంది. ఆశ్చర్యకరంగా కొందరిలో వైరస్ ప్రవేశించినా.. వ్యాధి లక్షణాలు కనిపించని పరిస్థితి ఉంది. వీరికి ప్రాణాపాయం లేకపోయినా వీరి వల్ల వైరస్ వ్యాప్తి చెందవచ్చు. అందువల్ల ఎక్కువ ఆసుపత్రి పడకలు అవసరమవుతాయి. సాపేక్షంగా మరణాల సంఖ్య తక్కువగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.