Cardamom For Weight Loss :యాలకులు మీ వంటకాలకు రుచులను అందించే సుగంధ ద్రవ్యమే కాదు.. మీ శరీర బరువును తగ్గించే ఓ సంజీవనిలా కూడా పనిచేస్తుంది. ఇవి శరీరంలోని అధిక కొవ్వు, కొలెస్ట్రాల్‌ను తగ్గించే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటాయి. యాలకులను రోజూ తినడం ద్వారా త్వరగా, సులువుగా బరువు తగ్గవచ్చు. ఇందులో పోషకాలు అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి.
ఓ అంతర్జాతీయ జర్నల్ ప్రచురించిన పరిశోధన ప్రకారం.. యాలకుల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్‌లు లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఈ మసాలా దినుసులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోని అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సాయపడతాయి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న యాలకులను రోజూ తినడం ద్వారా మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అవి ఏ విధంగా శరీర బరువును నియంత్రణలో ఉంచుతాయో ఇప్పుడు చూద్దాం.
జీవక్రియను మెరుగుపరుస్తుంది..
యాలకులు శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తాయి. మీ శరీరంలో పేరుకున్న అధిక కొవ్వును యాలకులు సులువుగా కరిగించి.. బరువు తగ్గడంలో సహాయపడుతాయి.
పొట్టను నిండుగా ఉంచుతుంది..
మసాలా దినుసుల్లో యాలకులకు ప్రముఖ స్థానం ఉంటుంది. సాధారణంగా వీటిలో ఆకలిని అణిచివేసే గుణం అధికంగా ఉంటుంది. దీంతో మీరు అధికంగా తినడం లేదా చిరుతిండ్లు తినడం తగ్గిస్తారు. ముఖ్యంగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే జంక్ ఫుడ్స్ తినడం ద్వారా శరీర బరువు పెరుగుతుంది. అయితే వీటికి దూరంగా ఉండేందుకు యాలకులు తోడ్పడతాయి. తద్వారా మీరు సులువుగా బరువు తగ్గవచ్చు.
అధిక నీటిని బయటకు పంపుతుంది..
యాలకులు శరీరంలోని నీటి నిలుపుదల శాతాన్ని తగ్గిస్తుంది. తరచూ వీటిని తినడం వల్ల సహజమైన మూత్రవిసర్జన జరుగుతుంది. ఇవి శరీరంలో ఉండే అధిక నీటి శాతాన్ని తొలగించి ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.