తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అది సాధారణ రోగం కాదు - క్యాన్సర్​ కావొచ్చు - ఇలా గుర్తించండి! - what are symptoms between flu and cancer

Cancer Signs That Could Be Mistaken For Flu: సాధారణంగా జ్వరం, దగ్గు వంటి ఫ్లూ లక్షణాలు కొన్ని రోజులు ఉంటాయి. ఆ తర్వాత తగ్గిపోతాయి. కానీ.. తగ్గిపోతూ మళ్లీ వస్తున్నాయంటే.. ఇలా తరచూ జరుగుతోందంటే.. ఆలోచించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి క్యాన్సర్ లక్షణాలు కూడా కావొచ్చని హెచ్చరిస్తున్నారు.

Cancer Signs That Could Be Mistaken For Flu
Cancer Signs That Could Be Mistaken For Flu

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 1:04 PM IST

Cancer Signs That Could Be Mistaken For Flu:మీకు జ్వరం, కండరాల నొప్పులు, విపరీతమైన దగ్గు, అలసట ఉన్నాయా..? ఈ లక్షణాలు తగ్గిపోతూ మళ్లీ వస్తున్నాయా..? ఇలా తరచూ కొనసాగుతూనే ఉందా? తస్మాత్​ జాగ్రత్త.. ఈ లక్షణాలు కేవలం జ్వరానికి సంబంధించినవి మాత్రమే కాకపోవచ్చు.. ప్రాణాంతక క్యాన్సర్​కు సంకేతాలు కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు!

రెండు వేర్వేరు:జ్వరం,క్యాన్సర్ వేర్వేరు వ్యాధులు. ఒకటి కాలానికి అనుగుణంగా ఉంటుంది. దానివల్ల ప్రమాదం పెద్దగా ఉండదు. కానీ.. మరొకటి సరైన సమయానికి రోగ నిర్ధారణ, చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. కానీ.. వీటికి దగ్గరి సంబంధం ఉంది. అదేంటంటే.. ఈ రెండు రోగాల లక్షణాలు చాలాసార్లు ఒకేలా కనిపిస్తాయి. అనేక క్యాన్సర్లు ఫ్లూ లాంటి సింప్టమ్స్​తోనే బయటకు కనిపిస్తాని నిపుణులు చెబుతున్నారు. అందుకే వాటి లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమని హెచ్చరిస్తున్నారు.

అలసట:ఫ్లూ సోకినప్పుడు అలసట సాధారణం. మందులు తీసుకొని.. రెస్ట్ తీసుకుంటే ఇది తగ్గిపోతుంది. కానీ.. రోజుల తరబడి విశ్రాంతి తీసుకున్నా విపరీతమైన అలసట ఉంటుంది. అప్పటికే కొన్ని రోజులుగా నిస్సత్తువ ఆవహించి ఉంటుంది. ఇది క్యాన్సర్‌కు ముందస్తు సంకేతమని వైద్యులు చెబుతున్నారు.

ఎసిడిటీ ముదిరితే జరిగేది ఆ ఘోరమే - కడుపులోని మంట ఇలా ఆర్పేయండి!

జ్వరం:జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పరిశోధకుల ప్రకారం.. ఫ్లూ, క్యాన్సర్ రెండింటికీ సాధారణ లక్షణం ఫీవర్​. ఫ్లూలో ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత జ్వరం కూడా తగ్గిపోతుంది. కానీ.. జ్వరం తగ్గకుండా పట్టిపీడిస్తుంటే అప్రమత్తంగా ఉండాలంటున్నారు. జ్వరం ఎక్కువగా రాత్రిపూట రావడం, ఇన్ఫెక్షన్ సంకేతాలు లేకపోవడం, రాత్రివేళ చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందేనని అంటున్నారు. అయితే జ్వరం తరచూ రావడం క్యాన్సర్ లక్షణమని.. వ్యాధి ముదిరిపోయిందనడానికి ఇది సంకేతమని చెబుతున్నారు.

పెయిన్స్​: నొప్పులు అనేక ఆరోగ్య సమస్యల వల్ల సంభవిస్తాయి. ప్రతి నొప్పీ చాలా వరకు క్యాన్సర్ కాదు. కానీ.. నిరంతర నొప్పి లోపల ఉన్న వ్యాధిని సూచిస్తుందట. క్యాన్సర్ వివిధ మార్గాల్లో నొప్పిని కలిగిస్తుంది. నిరంతరం నొప్పిని అనుభవిస్తూ ఉంటే.. అది ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవాలని.. అందుకోసం వైద్యుడిని సంప్రదించడం అవసరమని సూచిస్తున్నారు.

మీ శరీరం ఈ హెచ్చరికలు చేస్తోందా? - అయితే మీరు డేంజర్​లో ఉన్నట్టే!

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు:ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే.. అది ఫ్లూకు సంబంధించిన సమస్య కావొచ్చు. ఆయితే.. క్యాన్సర్ ఉన్నవారిలో కూడా ఇవే లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ రీసెర్చ్ యూకే ప్రకారం.. కొన్ని క్యాన్సర్లు శరీరంలోని ఇతర భాగాల నుంచి ఊపిరితిత్తులకు కూడా వ్యాపిస్తాయట. తద్వారా బ్రీతింగ్​ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

నిరంతర దగ్గు:దగ్గు వివిధ కారణాల వల్ల రావొచ్చు. జలుబు, ఫ్లూ, అలెర్జీలు లేదా తక్కువ తేమ కూడా దగ్గుకు దారితీయవచ్చు. వీటికోసం మందులు తీసుకుంటే కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ.. ఎన్ని మందులు తీసుకున్నా.. ఎంతకీ తగ్గకుండా దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతూ ఉంటే.. క్యాన్సర్​గా అనుమానించాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే.. పరిస్థితి తీవ్రంగా అనిపించినప్పుడు.. చాలా కాలం అనారోగ్యం కొనసాగినప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిదని అంటున్నారు.

అధిక కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నారా? - కరివేపాకుతో ఊహించని మార్పు - తేల్చిన రీసెర్చ్!

బెల్లం పసుపుతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? అస్సలే వదిలి పెట్టరు!

ABOUT THE AUTHOR

...view details