భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని దృఢం చేసే అంశాల్లో శృంగారానిది కీలక పాత్ర అని చెప్పొచ్చు. వైవాహిక జీవితంలో లైంగిక సంబంధం ఎంతో ముఖ్యం. ఇది సరిగ్గా ఉంటే ఇతర వ్యవహారాలు సక్రమంగా సాగుతాయి. అయితే సెక్స్‌కు సంబంధించి కొన్ని సందేహాలు, అనుమానాలు, అపోహలు చాలా మందికి ఉంటాయి. అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకున్నవారిలో అవి మరింత ఎక్కువగా ఉంటాయి.
అసలే ఆలస్యంగా పెళ్లి జరిగింది!.. శృంగారాన్ని ఆస్వాదించగలమా?.. భాగస్వామిని సంతృప్తి పరచగలమా? సెక్స్ హార్మోన్లు స్పందిస్తాయా? ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొనగలమా? అలా ఇలాంటి అపోహలతో సతమతవుతుంటారు. వాటిన్నంటిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
"సాధారణంగా శరీరానికి వృద్ధాప్య దశ వస్తుంది కానీ మనసుకు రాదు. మనసులో సెక్స్ పరంగా ఎప్పుడూ స్పందనలు ఉంటాయి. అందుకు సంబంధించిన హార్మోన్లు కూడా చక్కగా పనిచేస్తూనే ఉంటాయి. దాని వల్ల ఏ వయసులోనైనా సెక్స్‌ను చక్కగా ఆస్వాదించొచ్చు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వారు.. వయసులో ఉన్న వారిలా ఎక్కువసేపు, అనేక సార్లు పాల్గొనలేకపోవచ్చు కానీ శృంగారంలో ఎంజాయ్ చేయొచ్చు."