తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ పప్పులతో శృంగార జీవితం మెరుగ్గా.. - హేజెల్​ నట్స్

శృంగార జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ పప్పులు తినండి. మీరు అందులో మెరుగుపడతారని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పప్పులు ఏంటి? వాటి సంగతేంటి?

Boost your sexual desire with a handful of these nuts
శృంగార పప్పులు

By

Published : Aug 12, 2021, 7:56 PM IST

Updated : Aug 14, 2021, 11:10 AM IST

బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజ పప్పులు (నట్స్‌) చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉండటం దగ్గర్నుంచి ఉత్సాహం, మేధో శక్తి, మూడ్‌ పుంజుకోవటం వరకూ ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. ఇవి శృంగార జీవితం మెరుగుపడటానికీ తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది.

రోజుకు 60 గ్రాముల గింజ పప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగడమే కాకుండా మెరుగైన భావప్రాప్తిని పొందుతున్నారట. తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా ఉండే పాశ్చాత్య ఆహార అలవాట్లు గల కొందరిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరికి తమ సాధారణ ఆహారం, మరికొందరికి బాదం, అక్రోట్లు, హేజెల్‌ నట్స్‌ కూడా తినమని సూచించారు. ఇలా 14 వారాలు చేసిన తర్వాత పరిశీలించగా.. వీటికి గింజ పప్పులు జతచేసిన వారిలో శృంగారాసక్తి, భావప్రాప్తి మెరుగుపడినట్టు తేలింది.

గింజ పప్పుల్లో ప్రొటీన్‌, పీచు, అత్యవసర విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడేవే. వీటిల్లో ఫాలీఫెనాల్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి స్తంభనలోపం తగ్గటానికే కాకుండా గుండె రక్తనాళ వ్యవస్థకూ మేలు చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారానికి గింజ పప్పులనూ జోడించినట్టయితే అంగ స్తంభన, శృంగారాసక్తి మెరుగయ్యే అవకాశమున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వివరిస్తున్నారు.

ఇదీ చదవండి:రోగనిరోధకశక్తి పెంచే పవర్​ఫుల్​ ఫుడ్స్​ ఇవే!

Last Updated : Aug 14, 2021, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details