కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి.. అమ్మ చెంత హాయిగా నిద్రిస్తున్న పసిపాపను చూసి.. 'ఎంత అదృష్టం ఈ వయసులో వీరికి నిద్రపోవడం తప్ప మరో పనే ఉండదు అనుకుంటాం.' కానీ, అలా గంటల తరబడి వెల్లకిలా బజ్జుండే బుజ్జాయికి మాత్రమే తెలుస్తుంది అందులోని ఇబ్బందేంటో. విపరీతమైన ఒళ్లు నొప్పులు, చర్మం మంట, జీర్ణక్రియ సమస్యలు. ఇలా ఒకటీ, రెండూ కావు. ఆ సున్నితమైన శరీరంపై పెద్దయ్యాక కూడా వీటి ప్రభావం ఉంటుంది. అందుకే ఈ సమస్యలన్నింటీకీ 'అభ్యాంగ'(మసాజ్)తో చెక్ పెట్టమంటున్నారు ఆయుర్వేద నిపుణులు, ఆయుర్వేద మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి. శిశువు పుట్టిన వారం రోజుల తర్వాత నుంచి సున్నితంగా మసాజ్ ప్రక్రియ ప్రారంభించాలంటున్నారు.
లాభాలు
- అలసట నుంచి ఉపశమనం
- రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
- వర్షాకాలంలో బలహీనంగా ఉండే జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
- చర్మం పొడిబారకుండా.. మెరిసేలా చేస్తుంది.
- జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
- ఎముకలు, కీళ్లు, కండరాలు దృఢమవుతాయి.
- రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ వ్యాధుల నుంచి కాపాడుతుంది.
ఎలా చేయాలి..
మసాజ్ ఎలా పడితే అలా కాకుండా ఓ పద్ధతి ప్రకారం చేస్తేనే ఫలితం ఉంటుందంటున్నారు డాక్టర్ రాజ్యలక్ష్మి. కింద సూచించిన వరుస ప్రకారం మర్దన చేయాలంటున్నారు.
- తల
- పాదాలు
- కాళ్లు
- ఉదరం, ఛాతీ
- వెన్ను