Black Pepper Health Benefits in Telugu: నల్ల మిరియాలు ప్రతి ఒంటింట్లో కచ్చితంగా ఉంటాయి. మిరియాలు ఏ వంటకంలో వేసినా దాని టేస్ట్‌ను డబుల్ చేస్తాయి. మిరియాల చారు అయితే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. జలుబు చేసినప్పుడు ఇదే గొప్ప మెడిసిన్‌లా పని చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాల కారణంగా, ఆరోగ్య ప్రయోజనాల పరంగా.. నల్ల మిరియాలను శతాబ్దాలుగా మన వంటల్లో వాడుతున్నాం. మిరియాలను ‘బ్లాక్‌గోల్డ్’ అని కూడా పిలుస్తారు.
వీటిలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మిరియాలను మన రోజూవారీ డైట్‌లో కొంచెం చేర్చుకున్నా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చూసేయండి.
నిద్రపోయేప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త- మొటిమల సమస్య అధికమవుతుంది!
- బరువు తగ్గడం :ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఇబ్బందిపడేది బరువుతో. అయితే నల్ల మిరియాలలోని కాంపోనెంట్ పెపరిన్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇది కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. తద్వారా ఊబకాయాన్ని నిరోధించడంలో తోడ్పడుతుంది.
- క్యాన్సర్‌ను నివారిస్తుంది :నల్ల మిరియాలు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. నల్ల మిరియాలు ప్రధాన ఆల్కలాయిడ్ భాగం పైపెరిన్, వివిధ క్యాన్సర్లలో యాంటీట్యూమర్ కార్యకలాపాలను కలిగి ఉంటుంది.
- డయాబెటిస్ రాకుండా రక్షిస్తుంది..: మిరియాల్లోని ‘పెపరిన్’ అనే రసాయనం ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగవు. ఫలితంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
- గుండెకు మంచిది:నల్ల మిరియాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి, గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది.