తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నల్లద్రాక్షతో క్యాన్సర్​కు చెక్​ - గుండె జబ్బులకు, మైగ్రేన్ సమస్య​లకు పరిష్కారం! - black grapes uses in telugu

Black Grapes Benefits Telugu : ఆరోగ్యం కోసం పండ్లు తినమని డాక్టర్లు చెబుతుంటారు. ముఖ్యంగా నల్లద్రాక్ష తినడం వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. నల్లద్రాక్ష తినడం వల్ల క్యాన్సర్​, గుండె జబ్బులు, మైగ్రేన్ లాంటి సమస్యలు తొలగిపోతాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Benefits of Black Grapes in Telugu
Black Grapes Benefits Telugu

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 8:11 AM IST

Black Grapes Benefits Telugu :ద్రాక్ష పండు ఎంత రుచికరంగా ఉంటుందో, అంతకుమించి మేలు కూడా చేస్తుంది. చిన్నగా నల్లగా ఉండే ద్రాక్ష మనకు బలాన్ని ఇస్తుంది. ద్రాక్ష పండు రంగు, రుచి అన్నీ ప్రత్యేకమనే చెప్పాలి. నీలం, ఉదా రంగుల్లో ఉండే ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ద్రాక్ష పండును తినడం, జ్యూస్ చేసుకుని తాగడమే కాకుండా ఇంకా చాలా రకాలుగా వాడుతుంటారు. ద్రాక్ష సాసు, జామ్, కాంపోట్లు, డెజర్టులు లాంటి వివిధ రకాల పదార్థాలు తయారు చేయడానికి ద్రాక్షను వినియోగిస్తారు. దీనివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

గుండెకు మంచిది
నల్లద్రాక్షలో రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అథెరోస్కెర్లోసిన్ ప్రమాదాన్ని తగ్గించడానికి, రక్తంలో అధికంగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. నల్ల ద్రాక్షలో అధిక స్థాయిలో ఉన్న పొటాషియం, ఫైబర్ కంటెంట్​లు రక్తపోటు నియంత్రణకు సహాయపడుతాయి.

గుండెకు మంచిది

మైగ్రేన్ నివారణ
నల్లద్రాక్ష తినడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు తరుచుగా మూడ్​ స్వింగ్స్, తలనొప్పి, పిఎంఎస్ లక్షణాలతో బాధపడుతుంటే నల్ల ద్రాక్ష మంచి మందుగా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. నల్లద్రాక్షలోని రిబోప్లేవిన్ తలనొప్పి, మైగ్రేన్ నొప్పిని నివారిస్తుంది.

మైగ్రేన్ తలనొప్పికి మందు

చర్మం, జుట్టు సంరక్షణ
చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు కూడా ద్రాక్ష సహాయకారిగా పనిచేస్తుంది. గ్రేప్​ సీడ్ నూనె వల్ల జుట్టు నాజూకుగా తయారవుతుంది. గ్రేప్​ సీడ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ అధికంగా ఉంటాయి. ఇది రక్తప్రసరణను పెంచుతుంది. దీనివల్ల జుట్టు రాలడం, చిగుర్లు పగలడం, అకాలంగా తెల్లబడటం లాంటి సమస్యలను నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని బలమైన విటమిన్-సి సాంద్రత ముడతలను నివారిస్తుంది. చర్మ కణాలను పునరుజ్జీవింప చేస్తుంది. చర్మ మృదుత్వాన్ని పెంచుతుంది.

చర్మం,జుట్టు సంరక్షణ

కంటి చూపు మెరుగు
నల్ల ద్రాక్షలో కెరోటినాయిడ్లు, లుటిన్, జియాక్సంతిన్ ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ద్రాక్ష తినడం వల్ల రెటీనాకు రక్షణ లభిస్తుంది. అంధత్వాన్ని నివారిస్తుంది. కంట్లో శక్లాల సమస్యలు ఉన్నవారు తరచూ ద్రాక్ష తినడం వల్ల చూపు మెరుగవుతుందని చెబుతున్నారు డాక్టర్లు.

కంటి చూపు మెరుగు

క్యాన్సర్ రిస్క్​ను తగ్గుతుంది
క్యాన్సర్​తో ఎంత ముప్పు ఉందో అందరికీ తెలిసిందే. అయితే, నల్ల ద్రాక్ష తినడం వల్ల క్యాన్సర్ ముప్పు రాకుండా నివారించవచ్చు. ద్రాక్షలో యాంటీ మ్యూటాజెనిక్స్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రొమ్ము క్యాన్సర్ సహా చాలా రకాల క్యాన్సర్లతో పోరాడుతాయి. ఆల్కహాల్ సంబంధిత తల, మెడ క్యాన్సర్లను తగ్గించడానికి ద్రాక్షలోని రెస్వెరాట్రాల్ చాలా సహాయపడుతుంది.

క్యాన్సర్ రిస్క్​ను తగ్గుతుంది

3అంగుళాల పొడవైన అరుదైన ద్రాక్ష-దేశవిదేశాల్లో ఫుల్​ డిమాండ్​- రైతుకు రూ.లక్షల్లో ఆదాయం

'ఎంచక్కా ద్రాక్ష పండ్లు కోసుకొని తింటూ కొనుగోలు చేశారు'

ABOUT THE AUTHOR

...view details