Yoga Poses for Sinusitis: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో సైనసైటిస్ ఒకటి. సాధారణంగా సీజన్ మారినపుడు, ఉష్ణోగ్రతలలో మార్పువచ్చినపుడు సైనస్ వల్ల ఇబ్బందులు ఎక్కువవుతాయి. అయితే కొన్ని యోగాసనాలు ప్రాక్టిస్ చేస్తే.. వింటర్లో సైనస్ లక్షణాలు కంట్రోల్‌లో ఉంటాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సైనసైటిస్ అంటే ఏమిటి:ముక్కు లోపలి భాగాల్లో ఉండే గాలి గదులను సైనస్ అని అంటారు. ఈ సైనస్‌లు ఇన్ఫెక్షన్‌కు గురికావడం వల్ల సైనసైటిస్ వస్తుంది. అయితే ఇది చాలా రకాల కారణాల వల్ల వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్, పొల్యూషన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల సైనసైటిస్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంతే కాకుండా అలర్జీల వల్ల కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది.
సైనసైటిస్ లక్షణాలు:ముక్కు కారడం, ముఖంలో ఒత్తిడి, నొప్పి, వాసన గ్రహించే శక్తి తగ్గడం లాంటి లక్షణాలు ఉంటాయి. జలుబు చేస్తుంది. తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరంగా ఉంటుంది. కనుబొమ్మలు జివ్వుమని లాగుతుంటాయి. కాగా, శీతాకాలంలో సైనసిటిస్ లక్షణాలను తగ్గించడానికి.. కొన్ని యోగాసనాలు సహాయపడతాయి. అవేంటంటే..
వింటర్ ఎఫెక్ట్- జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? నో టెన్షన్- వీటిని ట్రై చేయండి!
సేతుబంధాసనం:ఈ ఆసనం ప్రాక్టిస్ చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఈ ఆసనం ఎలా వేయాలంటే..
- ముందుగా వెల్లకిలా శవాసనంలో పడుకోవాలి.
- ఇప్పుడు కాళ్లను పైకి లేపి పాదాలను నేలపై ఆనించి పిరుదులకి సమాంతరంగా ఉంచాలి.
- శరీరానికి సమాంతరంగా అరచేతులను నేలపై చాచాలి.
- నేల నుంచి శరీరాన్ని నెమ్మదిగా పైకి లేపాలి.
- మీ భుజాలను సర్దుబాటు చేసుకుంటూ కదలకుండా నెమ్మదిగా భుజాలు, చేతులు, కాళ్లపై శరీర బరువు నిలపాలి.
- గడ్డాన్ని ఛాతీకి తగిలేలా చూసుకోవాలి.
- శ్వాస తీసుకుని వదలాలి. ఇలా పదిహేను సెకన్లు ఈ ఆసనంలో ఉండాలి.
- తర్వాత నెమ్మదిగా యథాస్థితికి వచ్చి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
సడన్గా బరువు పెరిగారా? - మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే! చెక్ చేసుకోండి!
భుజంగాసనం: ఈ ఆసనం ఛాతిని, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. శ్వాస సమస్యలను దూరం చేస్తుంది. ఇది ఎలా వేయాలంటే..?
- ముందుగా బోర్లా పడుకుని శరీరం మొత్తాన్ని పూర్తిగా సాగదీయాలి.
- రెండు పాదాల వేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి.
- అరచేతులను ఛాతి పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి.
- శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతిని పైకి లేపాలి.
- మోచేతులు నేలకు ఆనుకుని ఉండేలా చూసుకోవాలి.
- కొద్దిసేపయ్యాక శ్వాసను వదులుతూ తిరిగి మామూలు స్థితికి రావాలి.