Best Yoga Asanas For Memory Improvement :భారతీయ ఋషి పతంజలి వరప్రసాదం యోగా. ఇది శారీరక, మానసిక రుగ్మతలను నయం చేసే గొప్ప సాధనం. ప్రాణాయామం, ధ్యానం, ఆసనాల కలయిక అయిన యోగాను క్రమం తప్పకుండా ఆచరిస్తే.. పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే పూర్వం విద్యార్థులందరికీ కచ్చితంగా యోగాను నేర్పించేవారు. ప్రస్తుత కాలంలో పిల్లలు చురుకుగా, హుషారుగా ఉండేందుకు యోగాను నేర్పించడం చాలా మంచిది.
ప్రాణాయామం
Pranayama Benefits : శ్వాసను నియంత్రించే గొప్ప యోగా సాధనం ప్రాణాయామం. ఇది మన శ్వాసను, నాడీ వ్యవస్థను నియంతిస్తుంది. ఫలితంగా మనలో ఉన్న మానసిక ఒత్తిడి సమూలంగా తగ్గుతుంది. పైగా మన ఏకాగ్రతను, బుద్ధి కుశలతను పెంచుతుంది. శారీరకంగానూ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
రక్త ప్రసరణ మెరుగవుతుంది!
యోగా చేస్తే మెదడుతో సహా శరీరమంతా చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా శరీరానికి తగినంత ఆక్సిజన్, పోషకాల సరఫరా చక్కగా జరుగుతుంది. దీని వల్ల దృష్టి, జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. అందుకే విద్యార్థులు కచ్చితంగా యోగా ఆచరించాలి.
విద్యార్థుల్లో.. ఏకాగ్రత, బుద్ధి, జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏమేమి ఆసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తాడాసనం :
Tadasana Health Benefits : కాళ్లు రెండూ దగ్గర ఉంచి, నిటారుగా నిలవాలి. అరిచేతులు రెండూ ఒకదానికి ఎదురుగా మరొకటి ఉండేలా పెట్టాలి. ఇలా మీకు వీలైనంత సేపు చేయాలి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తే, మీ ఏకాగ్రత బాగా పెరుగుతుంది. పైగా ఎత్తు కూడా పెరుగుతారు.
వృక్షాసనం :
Vrikshasana Benifits :ఒండి కాలుపై నిల్చుని చేసే ఆసనం ఇది. ఒక కాలుని నేలపై ఆన్చి, మరో కాలుని రెండో కాలి తొడపై ఉంచాలి. చేతులను నమస్కార భంగిమలో ఉంచాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వృక్షాసనాన్ని సాధన చేయాలి. దీని వల్ల మీ శరీరాన్ని చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. పైగా దృష్టి (ఫోకస్)ను మెరుగుపరుచుకోగలుగుతారు.
పశ్చిమోత్తన ఆసనం
Paschimottan asana Health Benefits : కాళ్లను ముందుకు చాపి కూర్చోవాలి. తరువాత మీ చేతులతో కాలి వేళ్లను తాకాలి. ఇలా వీలైనన్ని సార్లు చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ఆసనం వేస్తే వెన్నెముక బలపడుతుంది. మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది.
బాలాసనం
Balasana Benefits : ముందుగా మీరు ముడుకుల మీద కూర్చోవాలి. మీ కాలి మడమలపై మీద పిరుదులు ఉండేలా చూసుకోవాలి. తరువాత చేతులు ముందుకు చాచి తలను నేలకు వాల్చాలి. తరువాత చేతులతో పాదాలను పట్టుకోవాలి. ఈ యోగాసనం మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మెంటల్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తుంది.