Best Home Remedies To Lose Weight Fast : నేటితరాన్ని ఆరోగ్య పరంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు.. జనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వ్యాయామం, డైట్ అంటూ మొదలు పెడతారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత వదిలేస్తారు. దీంతో.. సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. ఇలాంటి వారికి ఆరోగ్య నిపుణులు పలు ఓ సలహా ఇస్తున్నారు. బరువు తగ్గడానికి ఇంతగా కుస్తీలు పట్టాల్సిన అవసరం లేదంటున్నారు. భోజనం చేసిన తర్వాత సరైన పద్ధతిలో నీటిని తాగడం ద్వారా.. ఎలాంటి వ్యాయామాలూ అవసరం లేకుండానే ఈజీగా బరువు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గోరువెచ్చని నీటితో చెక్ :ఎక్కువ మంది తిన్న తర్వాత చల్లని నీరు తాగుతారు. కానీ.. అలా తాగకూడదట. అందుకు బదులుగా.. గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకుంటే మీ పొట్టను ఈజీగా తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్రిజ్ నీటికి దూరంగా ఉండాలి :ఆయుర్వేదం ప్రకారం.. ఫ్రిజ్ నీరు తాగడం మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఫ్రిజ్ వాటర్ జీర్ణాశయంలోని అగ్నిని తగ్గిస్తుంది. ఫలితంగా ఆహారం తొందరగా జీర్ణమవ్వదు. దాంతో జీవక్రియ మందగిస్తుంది. బరువు పెరగడానికి తోడ్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఫ్రిజ్ వాటర్‌కు దూరంగా ఉండాలంటున్నారు.
High Protein Diet Health Benefits : హై ప్రోటీన్ ఫుడ్‌తో.. స్థూలకాయం సహా.. బీపీ, షుగర్లకు చెక్!
వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..