తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వ్యాయామం చేయడానికి టైమ్ లేదా? - ఆఫీసులోనే ఈ వర్కౌట్స్ చేయండి - పూర్తి ఆరోగ్యంగా ఉంటారు!

Best Workouts for Office Workers : ఈ రోజుల్లో అధిక బరువు అనేది సాధారణ సమస్య అయిపోయింది. చాలా మంది ఊబకాయంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆఫీస్​లలో పని చేసేవారు ఎక్కువ సమయం కూర్చోవడం ద్వారా సమస్య మొదలవుతోంది. అలాంటి వారికోసం వర్క్​టైమ్​లోనే చేసేవిధంగా బెస్ట్ వర్కౌట్స్ తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం..

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 10:10 AM IST

Best Workouts in Office
Best Workouts for Office Workers

Best Exercises for Office Employees :ఇంటి వద్దవ్యాయామం చేయడానికి టైమ్​ లేని వారు.. మీరు వర్క్ చేస్తున్న ప్రదేశంలోనే వర్కౌట్స్ చేయొచ్చు! వాటితో ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు పొందవచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

క్రమం తప్పకుండా బ్రేక్ : అధిక బరువు అనేక అనర్థాలకి దారితీస్తుంది. కాబట్టి దానిని నుంచి బయటపడడానికి మీరు చేయాల్సిన మొదటి వర్కౌట్ ఏంటంటే.. ఆఫీస్ వర్క్ మధ్యలో విరామం తీసుకోవడం. ప్రతి గంటకు లేచి నిలబడి బాడీని స్ట్రెచ్ చేయడం ద్వారా.. బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగడంతోపాటు కొన్ని కేలరీలు బర్న్ అవుతాయి.

డెస్క్ వ్యాయామాలు :అదేవిధంగా మీరు పనిచేస్తున్న ఆఫీస్​లో టైమ్​ దొరికినప్పుడు.. కొన్ని డెస్క్ వ్యాయామాలు చేయండి. లెగ్ లిఫ్ట్​లు, చైర్ స్క్వాట్‌లు, డెస్క్ పుష్-అప్‌లు వంటి సాధారణ వర్కౌట్స్ ప్రయత్నించండి. ఇవి చేయడం ద్వారా కండరాలు బలంగా మారతాయి.

ఎక్స్​ర్​సైజ్​ బాల్ : మీరు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడే మరో వర్కౌట్ ఏంటంటే.. ఆఫీస్​లో మీ డెస్క్ కుర్చీని ఎక్సర్​సైజ్ బాల్​తో భర్తీ చేయండి. దాని మీద కూర్చోని పనిచేయడం ద్వారా బాడీలో ప్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మంచి ఫీలింగ్​నూ ఇస్తుంది.

మెట్లు ఎక్కండి : చాలా మంది ఆఫీస్​లలో లిఫ్ట్ ఉయోగిస్తుంటారు. అలా కాకుండా వీలైనప్పుడల్లా మెట్లు ఎక్కే ప్రయత్నం చేయండి. ఈ సాధారణ మార్పు మీరు కేలరీలను బర్న్ చేయడమే కాకుండా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గి ఫిట్​గా ఉండాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

చలికాలంలో బద్ధకాన్ని వదిలి బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ టిప్స్​ ట్రై చేయండి!

ఫోన్ కాల్స్ సమయంలో నడవండి :మీరు ఆఫీస్​లో ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు కుర్చీలో కూర్చొని మాట్లాడకుండా.. ఖాళీగా ఉన్న ప్రదేశంలో నడుస్తూ మాట్లాడండి. అలాగే బ్రేక్ టైమ్​లో వీలైనప్పుడల్లా అలా ఆఫీస్ చుట్టూ నడవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం ద్వారా కూడా కొన్ని కేలరీలు బర్న్ అవుతాయి.

రెసిస్టెన్స్ బ్యాండ్‌లను యూజ్ చేయండి : మీ డెస్క్ వద్ద రెసిస్టెన్స్ బ్యాండ్‌లను పెట్టుకోండి. టైమ్ దొరికినప్పుడల్లా వాటితో ఈజీ వర్కౌట్స్ చేయండి. ఇవి మీ కండరాల పనితీరును మెరగుపరచడంతో పాటు కేలరీలను బర్న్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

సీటింగ్ పొజిషన్​పై దృష్టి పెట్టండి : చాలా మంది ఆఫీస్​లో ఎలా పడితే అలా కూర్చుంటారు. దాంతో బ్యాక్​పెయిన్ సమస్య వస్తుంటుంది. అలాకాకుండా మీరు రోజంతా ఒకే పొజిషన్​లో అంటే స్ట్రెయిట్​గా కూర్చొడానికి ట్రై చేయండి. ఇది కూడా మీ బాడీలో కేలరీలను బర్న్ చేయడానికి మంచి వర్కౌట్.

నీరు తాగండి :ఎక్కువమంది పని ఒత్తిడిలో పడి తగిన మొత్తంలో వాటర్ తాగరు. కానీ, అలాకాకుండా మీరు మధ్య మధ్యలో మంచినీరు తాగడం వల్ల బాడీని హైడ్రేటెడ్​గా ఉంచుతుంది. అలాగే మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మీ జీవక్రియను కూడా పెంచుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

డీప్ బ్రీతింగ్​ :చివరగా మీరు వర్కింగ్​ ప్లేస్​లో ఫాలో అవ్వాల్సిన మరో వర్కౌట్ ఏంటంటే.. డీప్ బ్రీతింగ్ తీసుకోవడం ప్రాక్టీస్ చేయడం. ఇలా పని మధ్యలో అప్పుడప్పుడూ లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా మీ కండరాలకు ఆక్సీజన్ సరఫరా పెరగడమే కాకుండా.. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

Weight Loss Tips in Telugu : బరువు తగ్గాలా..? కుస్తీలు అవసరం లేదు.. రోజూ ఇలా చేస్తే చాలు!

ఎక్కువ కష్టపడొద్దు.. 'స్మార్ట్​'గా బరువు తగ్గండిలా..

ABOUT THE AUTHOR

...view details