Best Tips For Reduce High Blood Pressure : నేటి స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు చాలా వరకు మారాయి. ఈ క్రమంలో చాలా మందిని పని ఒత్తిడి, ఇతరత్రా కారణాల వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇందులో.. వయసుతో సంబంధం లేకుండా జనం ఎదుర్కొంటున్న సమస్య.. అధిక రక్తపోటు(హైబీపీ). ఇది సాధారణ ఆరోగ్య సమస్యగా కనిపించినప్పటికీ.. అలా వదిలేస్తే ప్రాణాలకే ప్రమాదం! మరి.. దీన్ని నేచురల్ పద్ధతిలో ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.
ఈ ఆహారాలు తీసుకోండి : హైపర్ టెన్షన్‌ను నియంత్రించడంలో మీ ఆహారం చాలా కీలకం. రోజువారి డైట్లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్‌లను ఉండేలా చూసుకోవాలి. ఇవి బాడీలో సోడియం లెవల్స్ పెరగకుండా లిమిట్స్‌లో ఉంచుతాయి. ఈ విధంగా ఆహారం తీసుకోవడం ద్వారా.. కాలక్రమేణా రక్తపోటును తగ్గించుకోవచ్చు.
ఉప్పును తగ్గించండి :మీరు హైబీపీ నుంచి బయటపడాలంటే ప్రధానంగా చేయాల్సింది నిత్యం తినే కర్రీస్, ఆహార పదార్థాలలో ఉప్పును తగ్గించాలి. ఎందుకంటే సాల్ట్‌లో అధిక స్థాయిలో సోడియం ఉంటుంది. అది రక్తపోటును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఎక్కువ మొత్తంలో సోడియం కలిగి ఉండే ప్రాసెస్ చేసే రెస్టారెంట్ ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండండి.
పొటాషియం అధికంగా ఉండేవి : అరటిపండ్లు, చిలగడదుంపలు, ఆకు కూరలు వంటి వాటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా సోడియం కలిగించే ప్రభావాలను ఎదుర్కొనడమే కాకుండా రక్తపోటును తగ్గిస్తాయి.
మెగ్నీషియం, కాల్షియం ఉండేవి :ఆహారంలో మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉండే బాదం, పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి. వీటిలో ఉండే ఖనిజాలు రక్తపోటు నియంత్రణలో చాలా బాగా ఉపయోగపడతాయి.
క్రమం తప్పకుండా వ్యాయామం : మీరు డైలీ వ్యాయామం చేయడం ద్వారా గుండె బలోపేతం అవ్వడంతో పాటు రక్తనాళాల పనితీరు చాలా మెరుగవుతుంది. వీటితో పాటు రక్తపోటూ నియంత్రణలో ఉంటుంది. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.