Best Tips to Avoid Weight Gain After Marriage : ప్రతి ఒక్కరూ తమ శరీరాకృతి అందంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అయితే చాలా మందిలో పెళ్లికి ముందు ఉన్న ఫిగర్.. పెళ్లి తర్వాత ఉండదు. మ్యారేజ్ అయ్యాక జరిగే కొన్ని మార్పుల వల్ల ఆ ఎఫెక్ట్ బాడీపై పడుతుంది. ఇక కొందరైతే విపరీతంగా బరువు(Weight)పెరిగిపోతుంటారు. ముఖ్యంగా మహిళలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అయితే.. చాలా మంది పెళ్లి అయ్యింది కదా.. ఇంకేముందని తమపై తాము శ్రద్ధ తీసుకోరు. ఫలితంగా కొన్ని రోజులకు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అసలు, ఇంతకీ పెళ్లి తర్వాత బరువు పెరగడానికి కారణాలేంటి? వాటి నుంచి ఎలా బయటపడాలి? ఏ విధమైన ఆహారం తీసుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు ఈస్టోరీలో తెలుసుకుందాం..
పెళ్లి తర్వాత బరువు పెరగడానికి కారణాలివే..
Reasons to Gain Weight after Marriage..
- సరికాని ఆహారం తీసుకోవడం(Improper Diet) : చాలా మందికి పెళ్లి తర్వాత వారి ఆహారపు అలవాట్లలో మార్పు వస్తుంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత అత్తవారింటికి, ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు రోజువారీ తినే ఫుడ్ కాకుండా బయట ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అందులో ఉండే అదనపు కేలరీలు శరీరంలో ఫ్యాట్ పెరిగేలా చేస్తాయి.
- ప్రయారిటీస్ మారడం(Priorities Start Changing) : మహిళల్లో వివాహం తర్వాత కొన్ని విషయాలలో ప్రాధాన్యతలు మారుతాయి. ఎందుకంటే అత్తవారింటికీ అనుగుణంగా నడుచుకోవాలి. అలాగే ఇంటి పనులు, ఆఫీసు పనులని ఒక్కోసారి సరైన టైమ్‌కు ఆహారం తీసుకోరు. అది కూడా ప్రధాన కారణం.
- తరచుగా భోజనం చేయడం(Dining Out Frequently) :వివాహం తర్వాత చాలా మంది కొత్త కొత్త ప్రదేశాలు, వివిధ రెస్టారెంట్లకు వెళుతుంటారు. అలాగే స్నేహితులు, బంధువులతో కలిసి డిన్నర్ పార్టీలకు వెళ్తారు. దాంతో తరచుగా భోజనం చేస్తారు. దీనివల్ల శరీరంలో అదనపు కెలరీలు పెరిగి ఫ్యాట్ వస్తుంది.
- గర్భం(Pregnancy) : ముఖ్యంగా చాలా మంది మహిళలు బిడ్డకు జన్మనిచ్చాక వారి ఫిట్నెస్ను అంతగా పట్టించుకోరు. ఇది కూడా బరువు పెరగడానికి మరొక ప్రధాన కారణం.
ఆరోగ్యంగా ఉండాలా? మీ ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే!
Tips to Maintain Perfect Structure After Marriage:అయితేమీరు పెళ్లి తర్వాత వచ్చిన బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారా? దానికోసం మీరు తీవ్ర కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. ఈ టిప్స్ పాటించారంటే ఈజీగా మీ బరువు తగ్గించుకొని మ్యారేజ్‌కు ముందు ఉన్న ఫిట్నెస్ను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పని చేయడం : పెళ్లి తర్వాత బాడీ ఫిట్‌గా ఉండడానికి వ్యాయామం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కార్డియో ఎక్సర్సైజెస్, వెయిట్ లిఫ్టింగ్ అనేవి మీ బాడీని ఫిట్‌గా ఉండేలా చేస్తాయి.
గ్రీన్ టీ :ఈ గ్రీన్ టీ మీ జీవక్రియను పెంచుతుంది. అలాగే మీ శరీరంలో కొవ్వు నిల్వలను నిరోధించడంతో పాటు.. బాడీలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఆహారాన్ని నెమ్మదిగా నమలాలి : నేటి బిజీబిజీ లైఫ్‌లో హడావుడిగా ఆహారాన్ని నమలకుండా తినేస్తారు. అలా కాకుండా తినే ఆహారాన్ని నెమ్మదిగా నమలాలి. ఇలా చేయడం ద్వారాను బరువు పెరగరు.
హెవీ ఫిల్లింగ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి :వివాహం తర్వాత పని హడావుడిలో చాలా మంది పూర్తి అల్పాహారం తీసుకోరు. కొందరైతే రైస్ తీసుకుంటుంటారు. అలా కాకుండా డైలీ మార్నింగ్ అల్పాహారం తీసుకుంటే ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఈజీగా బరువు తగ్గాలా? తిన్న తర్వాత నీరు ఇలా తాగి చూడండి!
మన ఆహారపు అలవాట్లే అందంతో పాటే ఆరోగ్యాన్ని కూడా తీసుకొస్తాయనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి ముందు ఆ విషయంపై దృష్టి సారించి కచ్చితంగా ఓ క్రమపద్ధతిలో తినడం అలవాటు చేసుకోవాలి. పైన పేర్కొన్న వాటితోపాటు మేము చెప్పే ఆహార పదార్థాలను మీ రోజువారి ఫుడ్‌లో చేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఫలితంగా మీరు పెళ్లి తర్వాత కూడా చాలా ఫిట్‌గా ఉంటారు. అవేంటంటే..