తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఎంత ట్రై చేసినా ఫేస్​పై మొటిమలు తగ్గట్లేదా? - అయితే ఓసారి ఇవి ట్రై చేసి చూడండి! - Best Tips For Removing Pimples

Best Ways to Get Rid of Pimples : యుక్తవయసులోకి అడుపెట్టాక అందరిలో శారీరక మార్పులతో పాటు కొన్ని అందానికి సంబంధించిన మార్పులు కనిపిస్తాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొటిమలు. ఈ సమస్య ఎక్కువగా అమ్మాయిల్లో ఉంటుంది. అవి తగ్గించుకోవడం కోసం వారు చేయని ప్రయత్నాలు ఉండవు. అలాంటివారి కోసం వైద్యులు సూచించిన అదిరిపోయే టిప్స్ తీసుకొచ్చాం. వీటిని ఫాలో అయ్యారంటే రిజల్ట్ పక్కా కనిపిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Pimples
Pimples

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 2:44 PM IST

Best Treatment for Get Rid of Pimples : సౌందర్యపరంగా అమ్మాయిలను ఇబ్బందిపెట్టే ప్రధాన సమస్యలో ఒకటి.. మొటిమలు. సహజంగా వయసు పెరుగుతున్నా కొద్దీ బాడీలో హార్మోన్ల స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో శరీరంలో కొన్ని ఛేంజెస్ కనిపిస్తుంటాయి.​ వాటిల్లో పింపుల్స్(Pimples) ప్రాబ్లమ్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అయితే ఇవి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. అంటే కొందరిలో చిన్న పరిమాణంలో కనిపిస్తూ తక్కువ సంఖ్యలో ఉంటే.. ఇంకొందరిలో పెద్ద పరిమాణంలో ఉంటూ ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. అవి వచ్చాయంటే ఫేస్ మొత్తం అందవిహీనంగా మారుతుంది. దాంతో బయటకు వెళ్దామంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

How to Prevent Acne Problem : ఈ క్రమంలో చాలా మంది వీటిని తగ్గించుకోవడానికి ఏవేవో ఫేస్ ఫ్యాక్​లు, క్రీమ్స్, వంటింటి చిట్కాలు ట్రై చేస్తుంటారు. ఇక కొందరైతే వైద్యుడిని సంప్రదించి మందులు కూడా వాడుతుంటారు. ఇలా చేయడం ద్వారా కొందరిలో మార్పు కనిపిస్తే.. మరికొంతమందిలో ఎలాంటి మార్పు కనిపించకపోగా మరింత ఎక్కువ అవుతాయి. అలాగే వీటివల్ల కలిగే నొప్పితో కొందరు మొటిమల గిల్లుతుంటారు. దాంతో ఆ ప్లేస్​లో గుంతల్లా ఏర్పడుతాయి. అలాంటి వారికోసం మొటిమలను ఈజీగా తగ్గించుకోవడానికి వైద్యులు సూచించిన బెస్ట్ టిప్స్ తీసుకొచ్చాం. ఇవి ఫాలో అయ్యారంటే పింపుల్స్ సింపుల్​గా తగ్గిపోవడమే కాదు.. మీ ఫేస్ చాలా అందంగా తయారవుతుంది. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

  • మీరు మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లయితే ముందుగా.. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు వీలైనంత దూరం ఉండాలి. అలాగే స్వీయ పరిశుభ్రత పాటించాలి.
  • మీ రోజువారి డైట్​లో ఎక్కువగా ఇంట్లో తయారు చేసిన పోషకాహారం ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా మొటిమలను చాలా వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
  • ముఖ్యంగా మొటిమలు వచ్చినప్పుడు చాలా మంది వాటిని గిల్లుతుంటారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్‌ తగ్గే క్రమంలో మొటిమలను గిల్లినప్పుడు అక్కడ గుంతల్లా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మొటిమలను గిల్లే ప్రయత్నం మానుకోవాలి.

సెక్స్​లో పాల్గొంటే మొటిమలు తగ్గిపోతాయా?

  • ఇక చాలా మంది ఫేస్ వాష్ ఒక్కసారి చేసుకోవడానికి ఇబ్బందిపడుతుంటారు. అలా కాకుండా ముఖంపై బ్యాక్టీరియా చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి.
  • కొందరైతే చేతులను ఎక్కడ పడితే అక్కడి పెట్టి.. మళ్లీ అవే హ్యాండ్స్​తో ముఖాన్ని తాకుతుంటారు. ఇలా చేయడం ద్వారా కూడా మొటిమలు తగ్గవు. కాబట్టి హ్యాండ్స్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఫేస్​ను పదే పదే తాకకుండా చూసుకోవాలి.
  • అలాగే రసాయనాలతో కూడిన సౌందర్య ఉత్పత్తులు, సాధనాలకు దూరంగా ఉండాలి. ఇకపోతే బెడ్​షీట్స్, దిండు కవర్లను తరచూ మార్చతుండాలి. అవసరమైతే ఉతకడం చేస్తుండాలి.
  • వీటన్నింటితో పాటు మొటిమలు తగ్గించుకోవడానికి ఒత్తిడిని మీ దరి చేరకుండా చూసుకోవాలి. అందుకోసం మీరు సుమారు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి.
  • ఇవన్నీ పాటించినా మొటిమలు తగ్గకపోతే చర్మవ్యాధి నిపుణుల్ని సంప్రదించడం బెటర్. అప్పుడు వారు క్రీమ్స్‌తో పాటు కొన్ని రకాల మందులు సూచిస్తారు. వీటితో పింపుల్స్ ప్రాబ్లమ్ తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Tips For Glow Skin : పసుపు,పెరుగు, శెనగపిండితో ఈజీగా ఫేస్​ప్యాక్​.. మొటిమలు, ముడతలకు చెక్!​

మొటిమలున్న స్త్రీలకు ఆ​ కోరికలు ఎక్కువగా ఉంటాయా?

ABOUT THE AUTHOR

...view details