Best Cooking Tips for Thick Gravy :రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ కూరలు తయారు చేయాలని చాలా మంది తహతహలాడుతుంటారు. కానీ అవి ఓ పట్టాన కుదరవు. కొన్నిసార్లైతే థిక్ గ్రేవీ కోసం ట్రై చేస్తే.. పల్చగా, జారుడుగా వస్తుంటుంది. అప్పుడు ఎంతో కష్టపడి కర్రీ చేసినా వృథాయేనా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అయితే అలాంటప్పుడు మేము చెప్పే ఈ టిప్స్ పాటించారంటే.. మీరు చేసిన కూరల(Curries)కు చిక్కని గ్రేవీ రావడంతో పాటు రుచి కూడా అదిరిపోతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా అవి చాలా హెల్ప్ చేస్తాయి. మరి, గ్రేవీకి చిక్కదనం అందించే ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
జీడి పప్పుతో.. మీరు ఎప్పుడైనా పనీర్ గ్రేవీ, కాజూ మసాలా, ఆలూ మసాలా, చికెన్ మసాలా, పన్నీర్ మఠర్ మసాల వంటి రిచ్ గ్రేవీ కర్రీస్ వండేప్పుడు జీడిపప్పు పేస్ట్‌ని ఉపయోగించండి. ఎలాగంటే ముందుగానే కొన్ని జీడిపప్పుల్ని వేయించుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకొని.. పైన పేర్కొన్న కర్రీస్ ఉడికేప్పుడు తిప్పుతూ మిక్స్ చేసేయండి. ఇది గ్రేవీ చిక్కగా వచ్చేలా చేయడంతో పాటు కర్రీ టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఆరోగ్యానికీ మంచిది. ఇకపోతే జీడిపప్పుకు బదులుగా.. బాదం, గుమ్మడి, నువ్వులు, పల్లీలు కూడా వాడుకోవచ్చు.
పెరుగుతో..అలాగే కొన్ని రకాల మసాల కూరలు వండేటప్పుడు పెరుగు, ఫ్రెష్ క్రీమ్‌లను వాడడం ద్వారా కూడా చిక్కటి గ్రేవీ తీసుకురావచ్చు. ఇందుకోసం మీరు ఒక బౌల్‌లో చిక్కటి పెరుగు తీసుకుని బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని కూరలో వేసి మిక్స్ చేసుకోవాలి. అయితే కలిపే ముందు గ్యాస్ సిమ్‌లో పెట్టుకుంటే..పెరుగు అనేది తరకలుగా రాకుండా ఉంటుంది. ఇక దీనిలో కొద్దిగా మసాలా, కారం వేస్తే గ్రేవీ చిక్కగా రుచికరంగా వస్తుంది. పెరుగు.. కర్రీకి మంచి మైల్డ్ టేస్ట్‌ను తీసుకొస్తుంది.
Cooking Types : ఇలా వంటచేస్తే.. ఆరోగ్యానికి ముప్పేనట.. ఓసారి చెక్‌చేసుకోండి..!