తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 2:56 PM IST

ETV Bharat / sukhibhava

ఇంట్లో బియ్యం పురుగు పడుతోందా? - ఇలా చేశారంటే ఏడాదంతా నిల్వ చేసుకోవచ్చు!

Best Tips to Get Rid of Insects in Rice : మన ఇంట్లో బియ్యం ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసినప్పుడు లక్క పురుగు పట్టడం తరచూ చూస్తూనే ఉంటాం. దీంతో వాటిని తొలగించడానికి గృహిణులు నానా ఇబ్బందులు పడుతుంటారు. అలాకాకుండా ఉండడానికి మేము కొన్ని అదిరిపోయే చిట్కాలు పట్టుకొచ్చాం. వాటిని ఫాలో అయ్యారంటే ఎక్కువకాలం పురుగు పట్టకుండా మీరు బియ్యాన్ని నిల్వ చేసుకోవచ్చు!

Best Tips to Get Rid of  Worms in Rice
Best Tips to Get Rid of Worms in Rice

Best Tips to Get Rid of Worms in Rice :కొందరి ఇళ్లలో ఒకటీ రెండు రైస్​ బ్యాగ్స్​ తెచ్చుకుని స్టోర్ చేసుకుంటారు. మరికొందరైతే ఏడాది, ఆరునెలలకు సరిపోయే విధంగా బియ్యాన్ని కొన్ని నిల్వ చేసుకుంటారు. అయితే కొత్తలో బియ్యం బాగానే ఉన్నా.. కొన్నాళ్ల తర్వాత వాటిలో లక్క పురుగు, నల్లటి పురుగులు చేరి బియ్యాన్ని(Rice)పాడు చేస్తాయి. వీటిని తొలగించడం అంత ఈజీ పనికాదు. పల్లెటూళ్లలో ఉన్నవారైతే చేటలతో చెరిగి బియ్యానికి పట్టిన పురుగును తొలగించుకుంటారు. ఇదంతా పెద్ద పని. ఉద్యోగాలతో విధుల్లో బిజీగా ఉండే పట్టణవాసులకు అంత తీరిక ఉండదు. దాంతో.. కొంతమంది బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కెమికల్స్ వాడుతుంటారు. అయితే.. మేము చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే.. మీ బియ్యాన్ని పురుగుపట్టకుండా చాలా కాలం పాటు స్టోర్ చేసుకోవచ్చు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • ఎక్కువమంది బియ్యం నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలు వాడుతుంటారు. ఇంకొందరైతే రైస్ బ్యాగ్​లోనే ఉంచుతారు. అలాకాకుండా బ్యాగ్ కత్తిరించిన తర్వాత బియ్యాన్ని పెద్ద స్టీల్​ కంటైనర్​లో నిల్వ ఉంచాలి. కంటైనర్ లోపలికి గాలి వెళ్లకుండా జాగ్రత్తపడాలి! ఇలా రైస్​ స్టోర్ చేసుకుంటే చాలా కాలం పురుగు పట్టదు.
  • బియ్యంలో పురుగులు చేరకుండా ఉండడానికి మరో అద్భుతమైన చిట్కా ఏంటంటే.. రైస్​లో కొన్ని ఎండు మిరపకాయలు పెట్టడం. ఈ ఎండుమిర్చి వాసనకు బియ్యానికి పురుగులు పట్టవు! అయితే రెండు వారాలకు ఒకసారి వాటిని మార్చాలి. ఇలా చేయడం ద్వారా మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
  • మనం వివిధ వంటకాల్లో స్పైసీ కోసం ఉపయోగించే మిరియాలు కూడా రైస్​ ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి ఉపయోగపడాతాయి. మీరు బియ్యం మీద కొన్ని మిరియాలు వేయడం ద్వారా కూడా పురుగు పట్టదు. ఆ వాసన అన్ని కీటకాలనూ పారిపోయేలా చేస్తుంది. ఒకవేళ మీ బియ్యానికి ఇప్పటికే పురుగు పట్టినట్లయితే.. ఆ వాసనకు అవి పారిపోతాయి!

కూరలో కారం, ఉప్పు ఎక్కువైతే మీరేం చేస్తారు? - ఇలా ఈజీగా లెవల్ చేయొచ్చు!

  • రైస్ ఉంచిన కంటైనర్ లేదా పాత్ర ఏదైనాసరే.. అందులో బియ్యం అయిపోగానే దాన్ని కడిగి ఎండలో పూర్తిగా ఆరబెట్టండి.
  • ఆ తర్వాతనే మళ్లీ అందులో బియ్యాన్ని పోసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కీటకాలు చేరవు.
  • బియ్యం ఎక్కువ కాలం పురుగుపట్టకుండా ఉండడానికి అవి నిల్వ చేసిన డబ్బాలో కొన్ని వేప ఆకులూ, బిర్యానీ ఆకులూ వేయండి.
  • ఇలా చేయడం ద్వారా కూడా బియ్యంలో పురుగుపట్టకుండా ఉంటుంది. బిర్యానీ ఆకు చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు.
  • బియ్యపు కంటైనర్ లేదా పాత్రను చల్లని ప్రదేశంలో ఉంచండి.
  • ఇక.. ఇప్పటికే బియ్యానికి పురుగు పట్టి ఉంటే.. వాటిని ఎండలో ఆరబోయండి.
  • బియ్యం నుంచి పురుగులు వెళ్లిపోవడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది!

ABOUT THE AUTHOR

...view details