Best Tips to Avoid Vomiting While Travelling :ప్రతి ఒక్కరూ తమ అవసరాల రీత్యా ఎప్పుడో ఒకప్పుడు జర్నీ చేసే ఉంటారు. అయితే కొందరికీ ప్రయాణాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ, మరికొందరికీ జర్నీ(Journey) అంటే చాలు తెలియని భయం వెంటాడుతుంది. ఇక బస్సు, కారులో ప్రయాణమంటే చాలు ఎక్కువ ఆందోళన చెందుతారు. అందుకు ప్రధాన కారణం.. ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడ వికారం కలిగి 'వాంతులు' అవుతాయోనని భయం. దీంతో వారు పెద్దగా జర్నీ చేయడానికి ఇష్టపడరు. ఇక కొందరిలో అయితే ప్రయాణం స్టార్ట్ కాగానే వాంతుల సమస్య మొదలవుతుంది.
Best Tips to Prevent Motion Sickness : మరికొందరిలో మాత్రం ఆ వాహనం కండీషన్ బట్టి ఉంటుంది. వాహనంలో ప్రయాణించే వ్యక్తులకు అందులో వాసన వచ్చినసరే.. వికారంగా ఉంటుంది. అలాగే ఘాట్రోడ్లు, ఎక్కువసేపు ప్రయాణం, ఎగుడుదిగుడు రోడ్లు వల్ల వాంతులు అనేవి సంభవిస్తాయి. ఈ సమస్య బస్సు, కారులోనే కాదు.. కొందరికీ రైళ్లు, విమానం ఎక్కినా కూడా ఉంటుంది. అలాంటివారు ప్రయాణం చేసేటప్పుడు ఈ నాలుగు టిప్స్ ఫాలో అయ్యారంటే చాలు. ఇకపై ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా తమ జర్నీని కొనసాగించవచ్చు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సరైన సీటును ఎంచుకోవాలి : మనం వాహనంలో కూర్చునే చోటుతోనూ వాంతి భావన కలగొచ్చు. కాబట్టి సరైన సీటును ఎంచుకోవడం ముఖ్యం. కారులో ప్రయాణిస్తున్నట్లయితే.. ముందు సీటులో కంటే వెనక కూర్చుంటే వాంతులు అయ్యే అవకాశమెక్కువ. కాబట్టి ఫ్రంట్ సీటు బెటర్. ఇకపోతే బస్సులోనూ వీలైనంతవరకు ముందు వరుసలో కూర్చోవటం మంచిది. రైలులోనైతే రైలు కదిలే దిశవైపు ముఖం పెట్టి కూర్చోవాలి. కిటికీ పక్కన కూర్చుంటే ఉత్తమం. విమానంలో అయితే రెక్కల మీద సీటు ఎంచుకోవడం బెటర్. ఇలా సరైన సీటును సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వాంతుల సమస్య తగ్గించుకోవచ్చు.
సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి : జర్నీలో వాంతులు కాకుండా ఉండడానికి మరో చిట్కా ఏంటంటే.. సరైన వెంటిలేషన్. ఎందుకంటే వాహనం లోపల మంచి వెంటిలేషన్ ఉంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే వెళ్లి పోయేలా.. తగినంత గాలి తగిలేలా ఉంటుంది. అలాగే బయట వాతావరణాన్ని వీక్షిస్తూ ఆ భావన నుంచి బయటపడవచ్చు. తగినంత గాలి కోసం కారులో ఏసీ వాడుకోవచ్చు. రైలులో, బస్సులో అయితే కిటికీ నుంచి వచ్చే గాలి ముఖానికి తగిలేలా చూసుకోవాలి.