Early Morning Wake Up Tips :ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేయాలనుకుంటూ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తారు చాలా మంది. కానీ.. తెల్లవారిన తర్వాత పరిస్థితి మారిపోతుంది. అలారం ఆఫ్ చేసి మరీ నిద్రపోతుంటారు! మారిపోయిన జీవన శైలితోనే ఈ సమస్య వస్తోందని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటే.. మేము చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అలారం కూడా అవసరం లేకుండానే ఈజీగా నిద్ర లేస్తారు!
సమయాన్ని సెట్ చేసుకోండి : ఉదయాన్నే నిద్ర లేవాలంటే.. ఒక టైమ్ టేబుల్ అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవాలి. ఆ పడుకునే సమయాన్ని బట్టే.. పొద్దున నిద్ర లేవాలనుకునే టైమ్ నిర్ణయించుకోవాలి. దీన్ని కంటిన్యూ చేయాలి. కొత్తలో సరిగా అమలు కాదు. అయినా కొనసాగించాలి. అప్పుడు ఆటోమేటిగ్గా అలవాటైపోతుంది.
వాటిని దూరంగా ఉంచండి :చాలా మందికి నిద్రపోయే ముందు ఎక్కువసేపు మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీ చూసే అలవాటు ఉంటుంది. ఒకవేళ మీకు ఆ హ్యాబిట్ ఉంటే వెంటనే మార్చుకోండి. ఎందుకంటే మొబైల్, ల్యాప్‌టాప్‌ల నుంచి వచ్చే బ్లూలైట్.. మెలటోనిన్ ఉత్పత్తికి అటంకం కలిగిస్తుంది. అది మన నిద్రకు భంగం కలిగిస్తుంది.
అలారం వద్దు : ఉదయాన్నే నిద్ర లేవడానికి ఎక్కువ మంది అలారం పెట్టుకుంటారు. అంటే.. మీరు సమయానికి నిద్రలేవలేరు అని అంగీకరిస్తున్నారన్నమాట! అందుకే అలారం మీద ఆధారపడుతున్నారు! ఇలా ఎవరో ఒకరిపై ఆధారపడే వారు.. సమయానికి నిద్రలేవరు. అలారం పెట్టుకున్నా.. మోగగానే దాన్ని ఆఫ్ చేసి మళ్లీ నిద్రపోతారు. కాబట్టి.. ముందు అలారం బంద్ చేయండి. పైన చెప్పిన విధంగా.. మీ శరీరంలోనే జీవగడియారాన్ని ఏర్పాటు చేసుకోండి.
వాకింగ్‌తో వెయిట్ లాస్- వారంలో ఎన్ని రోజులు, ఎంత సేపు నడవాలి?