Best Tips to Reduce Spice in Curries :ఎంతో ఇష్టపడి వండుకున్న కూరల్లో ఒక్కోసారి కారం, ఉప్పు, మసాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. దీంతో.. అప్సెట్ అవుతూ ఉంటారు. కష్టపడి ప్రిపేర్ చేసుకున్న కర్రీని(Curry)పారేయాలంటే మనసొప్పదు. అలాగని దాన్ని ఆస్వాదించలేరు. ఇలాంటి సందర్భం ప్రతి ఒక్కరికీ ఎప్పుడో అప్పుడు ఎదురయ్యే ఉంటుంది. ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఈ టిప్స్ పాటించండి.
పెరుగుతో.. కూరలో కారం ఎక్కువైనప్పుడు పెరుగు వేస్తే.. అది కారాన్ని సమతుల్యం చేస్తుంది. అంతేకాదు.. మంచి టేస్టీ గ్రేవీని అందిస్తుంది. కేవలం పెరుగునే కాకుండా.. క్రీమ్ కూడా కర్రీస్‌లో వేయొచ్చు. ఇది అధికంగా పడిన మసాల, ఉప్పు, కారాన్ని ఈజీగా లెవల్ చేస్తుంది.
బంగాళాదుంపలతో..కర్రీలో ఉప్పు, కారం, మసాలా.. వీటిల్లో ఏది ఎక్కువైనా అందులో ఆలుగడ్డలు వేయొచ్చు. ఈ చిట్కా పూర్వం నుంచి ఆచరిస్తున్నదే. కానీ.. ఎక్కువమందికి ఇది తెలిసిఉండకపోవచ్చు. కాబట్టి ఈసారి ఎప్పుడై మీ కూరలో కారం లేదా ఉప్పు ఎక్కువైతే.. ఆలుగడ్డను కట్ చేసి అందులో వేసి కాసేపు ఉడికించండి. అంతే రుచికరమైన కర్రీ రెడీ.
How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!
కెచప్‌తో..సాధారణంగా టొమాటో కెచప్ అనేది తీపి రుచిని కలిగి ఉంటుంది. మనం వివిధ స్నాక్స్‌తో కలిపి దీనిని తీసుకుంటూ ఉంటాం. అయితే ఎవరికీ తెలియని ట్రిక్ ఏంటంటే.. ఈ కెచప్‌తో కర్రీలో కారం తగ్గించుకోవచ్చు. అలాగే ఇది కర్రీకి మంచి రుచిని అందిస్తుంది.