తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

సన్ స్క్రీన్ లోషన్ వాడితే రాషెస్ వస్తున్నాయా? ఇలా చేయండి!

సన్ స్క్రీన్ లోషన్స్ ఎలా వాడాలో కొంతమందికి తెలియక చర్మ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. సన్ స్క్రీన్స్ ఎలా వాడాలో, ఎలాంటివి వాడాలో తెలుసుకుందాం.

సన్ స్క్రీన్ లోషన్
sunscreen lotion

By

Published : Nov 4, 2022, 9:08 AM IST

సన్ స్క్రీన్ లోషన్స్ ఎలా వాడాలో, ఎలాంటివి వాడాలో చాలా మందికి తెలియదు. కొన్ని స్కిన్​కు పడకపోవడం వల్ల రాషెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటప్పుడు వీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచిదని చర్మ సంబంధిత నిపుణులు అంటున్నారు. అయితే కెమికల్ సన్ స్క్రీన్ కాకుండా ప్యూర్ ఫిజికల్ సన్ స్క్రీన్ వాడితే చర్మానికి మంచిదని చెబుతున్నారు.

ఈ ఫిజికల్ సన్ స్క్రీన్​లో జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్ లాంటివి ఉంటాయి. ఈ మినరల్స్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ వాడితే అలర్జీలు, రాషెస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా. అయితే డ్రై స్కిన్ ఉన్న వారు ఫాటీ ఆసిడ్స్ ఉన్న సోప్, లిక్విడ్ ఫేస్ వాషెస్ వాడటం మంచిదని నిపుణులు అంటున్నారు. ముఖం కడుక్కుని, టవల్​తో తుడుచుకున్న వెంటనే.. ఫేస్ కొంచెం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకుని, తర్వాత ఈ ఫిజికల్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details