తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నొప్పులకు పెయిన్ కిల్లర్స్ చాలా డేంజర్ - ఈ నేచురల్ టిప్స్ పాటించండి! - ఫుల్ రిలీఫ్

Best Tips for Pain Relief : సాధారణంగా చాలా మంది ఏవైనా నొప్పులు వేధిస్తున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. వాటిని వేసుకోవడం ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతుంటారు. అయితే అలా వాడడం చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేనిపోని అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు. అందుకు బదులుగా మేము కొన్ని బెస్ట్ సహజ నివారణ చిట్కాలు పట్టుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Tablets
Tablets

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 11:53 AM IST

Best Natural Home Remedies for Pain Relief : ప్రస్తుతం చాలా మందిని ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయి. ముఖ్యంగా మనం రోజంతా విపరీతంగా పనిచేసి బాగా అలసిపోయినప్పుడు ఒళ్లు ఎక్కువగా బాధిస్తాయి. ఇక వింటర్​లో ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. ఎక్కువగా ఆడవాళ్లలో ఈ ప్రాబ్లమ్ కనిపిస్తుంటుంది. ఈ క్రమంలో చాలా మంది నొప్పిని భరించలేక వెంటనే మెడికల్ షాప్ దగ్గరకు వెళ్లి పెయిన్ కిల్లర్స్(Pain Killers)తెచ్చుకుంటారు. ఒక నొప్పులు వచ్చినప్పుడే కాదు.. తలనొప్పి, కడుపు నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు వచ్చినప్పుడు ఎక్కువ మంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ, ఇలా వాడడం అప్పటివరకు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Home Remedies for Pain Relief : అంతేగానీ భవిష్యత్తులో ఈ మందుల వాడకం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇలా ప్రతిసారి నొప్పులు వేధించినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులకు బదులుగా మేము చెప్పే కొన్ని సహజ నివారణ పద్ధతులు ట్రై చేయండి. ఇవి ఫాలో అయ్యారంటే అటు హెల్త్ బాగుంటుంది.. ఇటు నొప్పులు సమస్య తగ్గిపోతుంది. మరి, ఆ నేచురల్ హోమ్ రెమిడీస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

​కోల్డ్ కంప్రెస్ : ఇది చాలా మందికి తెలిసిన విషయమే అయినా దీనిని యూజ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తారు. దానికంతా టైమ్ ఎక్కడ ఉందని ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని.. ఎక్కువ మంది అలా మెడికల్ దుకాణానికి వెళ్లి ట్యాబ్లెట్ తెచ్చి వేసుకుంటారు. కానీ అది డేంజర్ అనే విషయం చాలా మంది మర్చిపోతారు. కాబట్టి ఇప్పటినుంచైనా అలా కాకుండా కోల్డ్​ కంప్రెస్ అనే సాధారణ పద్ధతిని ఫాలో అవ్వండి. దీని ద్వారా నొప్పి, వాపుని తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మీరు ఐస్ క్యూబ్​ని తీసుకుని దానిని ఓ బట్టలో చుట్టి పెయిన్ వేధిస్తున్న చోట అప్లై చేయండి. అప్పుడు రక్తనాళాలు శాంతించి వాపు, నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. అలాగే ఈ ప్రాసెస్ ద్వారా తీవ్రమైన గాయాలూ నయమవుతాయి.

ఎసిడిటీ ముదిరితే జరిగేది ఆ ఘోరమే - కడుపులోని మంట ఇలా ఆర్పేయండి!

అల్లం, పసుపు :పసుపు చాలా రోగాలకు అద్భుతమైన మెడిసిన్​గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు నొప్పి నివారణకు చాలా బాగా పనిచేస్తాయి. పసుపు ద్వారా చర్మ సంరక్షణే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ పసుపు నొప్పుల తగ్గించుకోవడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. దీనిని నొప్పుల నివారణకు ఎలా వాడాలంటే.. ముందుగా కొన్ని అల్లం ముక్కలు తీసుకొని పేస్ట్​లాగా చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పసుపు యాడ్ చేసుకుని నొప్పులు ఉన్న చోట అప్లై చేయాలి. ఈ రెండూ నిప్పిని తగ్గించేందు, మంట నుంచి ఉపశమనం పొందేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి.

ఆయిల్ మసాజ్ : నొప్పులు తగ్గించుకోవడానికి మరో అద్భుతమైన సహజ నివారణ చిట్కా ఏంటంటే.. ఆయిన్ మసాజ్. ఇందుకోసం మీరు లావెండర్, పిప్పర్​మెంట్, అరోమాథెరపీ, యూకలిప్టస్ వంటి ఆయిల్స్‌ని యూజ్ చేయవచ్చు. వీటితో పెయిన్స్ ఉన్న చోట మసాజ్ చేస్తే చాలు.. నొప్పి, ఒత్తిడి ఇట్టే తగ్గిపోతాయి. అలాగే ఆయిల్స్​ నుంచి వచ్చే వాసన చాలా వరకు ఒత్తిడిని తగ్గిస్తుంది. పెయిన్స్ నుంచి కూడా ఎక్కువ ఉపశమనం లభిస్తుంది.

ఆక్యుపంక్చర్ :ఇక చివరగా మందులు వాడకుండా పెయిన్స్ నుంచి ఉపశమనం పొందడానికి మరో పద్ధతి ఏంటంటే.. ఆక్యుపంక్చర్. దీనిని చైనీస్ బెస్ట్ ఆక్యపంక్చర్​ అంటారు. ఈ పద్ధతి ద్వారా చాలా వరకు నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇది బాడీలోని నరాలను శాంతపర్చడంతోపాటు.. జీవశక్తిని కూడా ఉంచుతుంది. ఆక్యుపంక్చర్ అంటే ఏమిటంటే.. కొన్ని సూదుల లాంటి వస్తువులతో వేళ్ళపై ఒత్తిడిని తీసుకురావడం. ఇది నొప్పిని చాలా ఎఫెక్టివ్‌గా తగ్గిస్తుంది.

Stomach Pain After Eating : తిన్న వెంటనే కడుపులో నొప్పిగా ఉందా? అల్సర్ కారణమా? తగ్గాలంటే ఏం చేయాలి?

అవాంఛిత రోమాలా? ఆందోళన వద్దు! ఈ ప్యాక్స్​ ట్రై చేస్తే ప్రాబ్లెమ్​ సాల్వ్​!

ABOUT THE AUTHOR

...view details