Best Indian Snacks for Good Health : భోజనానికీ.. భోజనానికీ మధ్య ఎక్కువ గ్యాప్ వస్తే.. కడుపులో అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే.. స్నాక్స్ తినాలని చెబుతారు వైద్యులు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది. కానీ.. స్నాక్స్‌లో ఏం తింటున్నామన్నది అంతకన్నా ముఖ్యం. అనారోగ్యకరమైన ఫుడ్ తినడం ద్వారా.. హెల్త్ మరింతగా పాడవుతుంది. అందుకే.. హెల్దీ స్నాక్స్ మీకోసం తీసుకొచ్చాం. మరి, అవేంటో చూడండి.
చనా చాట్(Chana Chaat) : కొద్ది మొత్తంలో శనగలను తీసుకుని వాటిని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని స్పైసీ కోసం కొన్ని మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికోసం ఉల్లిపాయ, టమాట ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. ఇది క్రంచీ, ప్రోటీన్-ప్యాక్డ్ అల్పాహారందా ఉంటుంది. ఈ హెల్తీ స్నాక్ కొలెస్ట్రాల్‌ను పెంచదు. దీనిని రోజులో ఏ సమయంలోనైనా ప్రిపేర్ చేసుకుని ఆస్వాదించవచ్చు.
మూంగ్ దాల్ చీలా(Moong Dal Cheela) : ఇది కూడా ఒక రుచికరమైన హెల్తీ స్నాక్. దీనిని ఎలా తయారుచేసుకోవాలంటే.. మొదట పెసరపప్పును నానబెట్టాలి. ఆ తర్వాత దానిని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై దీనికి కొద్ది మొత్తంలో మసాలాలతో పాటు కొత్తమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అంతే అధిక ప్రోటీన్ గల మూంగ్ దాలా చీలా రెడీ.
స్ప్రౌట్స్ చాట్(Sprouts Chaat) :ఈ చాట్ కోసం ముందురోజే కొన్ని పెసర్లు, శనగలు నానబెట్టి ఆ రోజు రాత్రి ఒక క్లాత్‌లో కట్టిపెట్టుకోవాలి. నెక్ట్ డే మొలకెత్తిన వాటిని తీసుకొని వాటికి కొన్ని హెల్తీ కూరగాయలు యాడ్ చేసుకోవాలి. అవసరమైతే వీటికి తాళింపు వేసుకోవచ్చు. ఇక చివరగా నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
భేల్ పూరి(Bhel Puri) : దీని కోసం ముందుగా కొన్ని మరమరాలు/పేలాలు తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి తరిగిన ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆపై తగినంత కారం, సాల్ట్ వేసుకోవాలి. అవసరమైతే రుచికోసం చాట్ మసాలా, జీలకర్ర పొడి కలుపుకోవాలి. ఇంకా పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. చివరగా అన్నింటినీ బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర వేసి, నిమ్మకాయ పిండుకోవాలి. అంతే రుచికరమైన భేల్ పూరి రెడీ.