Best Home Remedies to Avoid Blackheads on Nose: ముఖం.. అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి..? కానీ, మొటిమలు, బ్లాక్ హెడ్స్, ముడతలు వంటి సమస్యలు.. ముఖాన్ని అందవిహీనంగా మారుస్తూ ఉంటాయి. అయితే.. వీటిల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది బ్లాక్హెడ్స్. ఈ బ్లాక్ హెడ్స్ తొలగిచడానికి ఫేస్ స్క్రబ్, బ్లాక్ హెడ్స్ రిమూవల్ ఫేస్ వాష్, రకరకాల క్రీమ్లు వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు.. ఈ సమస్యను తొలగించుకోవడానికి పార్లర్లకు కూడా వెళ్తూ ఉంటారు. అయితే కాస్త సమయం వెచ్చించి, ఓపిక వహిస్తే ఇంట్లోనే వాటిని సులభంగా తొలగించుకోని.. అందంగా రెడీ కావచ్చు.
అసలు బ్లాక్ హెడ్స్ ఎందుకు వస్తాయ్..?: చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ గ్రంథి ఆయిల్స్ విడుదల చేస్తుంది. ఈ నూనె ఉత్పత్తి ఎక్కువైనప్పడు దానికి చర్మంలోని మలినాలు తోడయ్యి బ్లాక్హెడ్స్ ఏర్పడతాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే దుమ్ము, ధూళీ, వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారిలోనూ ఇవి ఎక్కువగా వస్తుంటాయి. మరి ముక్కు మీద ఉన్న బ్లాక్‌హెడ్స్‌ను తొలిగించే నివారణ మార్గాలను ఇప్పుడు చూద్దాం..
స్టీమింగ్: ఆవిరి పట్టడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఒక పాత్రలో బాగా మరిగించిన నీళ్లు తీసుకొని ఆ ఆవిరిని ముఖానికి పట్టాలి. ఇందుకోసం ఒక టవల్ ఉపయోగించి తల మీదుగా కవర్ చేయాలి. ఇలా ఒకటి నుంచి రెండు నిమిషాలు ముఖానికి ఆవిరి పట్టి తీసేయాలి. ఈ విధంగా మూడు లేదా నాలుగుసార్లు చేయాలి. తర్వాత బ్రౌన్ షుగర్‌తో మృదువుగా మర్దన చేసుకోవడం ద్వారా బ్లాక్‌హెడ్స్ తొలగిపోవడంతో పాటు మోము కూడా ప్రకాశవంతంగా మారుతుంది. అయితే ముఖానికి మరీ ఎక్కువ సమయం ఆవిరి పట్టకూడదు. అలాగే నీళ్లు మరీ ఎక్కువ వేడిగా ఉన్నా చర్మానికి హాని కలగవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ముందుగా ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని దానికి కొంచెం నీరు కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్‌ను ముక్కు మీద రౌండ్ షేప్‌లో ఒకటి లేదా రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ విధానాన్ని వారానికి ఓ సారి ట్రై చేయండి.