Tips for Smokers Lips in Telugu: పెదవులు ఆరోగ్యంగా ఉంటేనే.. అవి అందంగా కనిపిస్తాయి. కానీ.. సిగరెట్ కాల్చడం వల్ల కాలక్రమేణా నల్లగా, నిర్జీవంగా మారిపోతాయి. సిగరెట్‌లో ఉండే నికోటిన్.. పెదవులకు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తుంది. సిగరెట్ పొగ నుంచి వెలువడే వేడి శరీరంలో మెలనిన్‌ను విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది. దీనివల్ల.. నోటి చుట్టూ ఉన్న ప్రాంతం నల్లగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతో.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Health Benefits Of Honey : 'తేనె'తో ఎన్నో లాభాలు.. చిన్న పిల్లలు, షుగర్ ఉన్నవాళ్లు తీసుకోవచ్చా?
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె.. హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది మీ పెదవులను పొడి బారనీయకుండా.. డల్‌గా కనిపించకుండా హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. ఇది దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల లిప్స్‌కు కొబ్బరి నూనె మంచి మందు. ముందుగా మీ పెదవులకు కొద్దిగా కొబ్బరినూనె రాయండి. తర్వాత సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల పెదపులు హైడ్రేటింగ్‌గా ఉండి నల్లగా మారకుండా ఉంటాయి. బెస్ట్ రిజల్ట్ కోసం మీరు ప్రతిరోజూ రెండుసార్లు దీనిని ట్రై చేయండి.
తేనె: ఇన్ఫెక్షన్లను అడ్డుకునే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తేనెలో పుష్కలం. ఇది కూడా లిప్స్‌కు మంచి రంగు వచ్చేలా చేస్తుంది. ముందుగా తేనెను మీ పెదవులపై అప్లై చేసి.. ఆ తర్వాత రౌండ్‌గా స్క్రబ్ చేయాలి. సున్నితంగా మసాజ్ చేసి అనంతరం.. గోరు వెచ్చని నీటితో క్లీన్ చేయండి. ఇది మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి.. పెదవులు మెరిసిపోయేలా చేస్తుంది.