Best Home Remedies for Dark Neck :అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ఫేస్‌ప్యాక్‌లు, క్రీములు ఇలా ఎన్నో వాడుతుంటారు. అయితే ముఖం విషయంలో అంత శ్రద్ధ చూపించి.. మెడ భాగాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. దీంతో మెడ నల్లగా మారుతుంది. మెడపై ఏర్పడే నలుపు కారణంగా చాలా మంది మహిళలు బయటకు రావడానికి ఇష్టపడరు.
Tips for Get Rid of Dark Neck :ఇక కొందరైతే ఆ మచ్చలు పోగొట్టుకునేందుకు బ్యూటీపార్లర్‌లో స్క్రబ్బింగ్, మసాజ్, ఫేషియల్ వంటి చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది. అలాకాకుండా ఈ స్టోరీలో చెప్పే నేచురల్ హోమ్ రెమిడీస్తో మీ మెడపై ఏర్పడిన నలుపును ఈజీగా తొలగించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా మీ మెడ తెల్లగా మారడం ఖాయమంటున్నారు. మరి, ఆ టిప్స్ ఏంటి? వాటిని ఎలా వాడాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
బేకింగ్ సోడా :అందరి ఇళ్లలో వివిధ వంటకాల్లో ఉపయోగించే బేకింగ్ సోడా.. మెడ ప్రాంతంలోని నలుపును పోగొట్టి చర్మాన్ని మెరిపించేందుకు బాగా పనిచేస్తుంది. దీనిని మంచి స్కిన్ క్లెన్సర్ అని కూడా చెప్పొచ్చు. అలాగే చర్మంపై ఉన్న మురికిని దూరం చేసి చర్మం లోపల నుంచి పోషకాలను పొందేలా చేస్తుంది.
ఎలా వాడాలంటే.. మీరు ముందుగా రెండు, మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని నీరు కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత దానిని మెడకు అప్లై చేసి.. కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆపై ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం తేమగా మారి సమస్య తగ్గుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ :చర్మంలో పీహెచ్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు స్కిన్ నల్లగా మారుతుంది. అలాంటి సమస్యకి ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మీ చర్మంలోని మృతకణాలను దూరం చేసి సహజ మెరుపుని అందించడానికి ఇది చాలా సహాయపడుతుంది.
ఎలా వాడాలంటే.. ఇందుకోసం మీరు ముందుగా రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నీటిలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఓ కాటన్ బాల్ తీసుకుని అందులో ముంచి మెడ ప్రాంతంలో నలుపుగా ఉన్న దగ్గర అప్లై చేయాలి. 10 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత దానిని క్లీన్ చేసుకోవాలి. దీంతో ఈజీగా ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఇలా చేస్తే ముఖం ఎంతో తాజాగా ఉంటుంది!