Best Herbs To Help Lower Cholesterol :ప్రస్తుత కాలంలో అధిక కొలెస్ట్రాల్‌తో చాలా మంది బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు, ఇతర అనారోగ్యాలు బారినపడుతున్నారు. కొవ్వు కరిగించుకోవడానికి కొందరు మందులు వాడుతారు. అయితే అధిక కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఒక సింపుల్ హోం రెమెడీ ఉందని మీకు తెలుసా? ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని ఆకుల్ని తినడం వల్ల మీ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అవేంటంటే?
1. మునగ ఆకులు
మునగ ఆకుల్ని మొరింగ లీవ్స్ అని కూడా అంటారు. వీటిల్లో మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఐరన్, జింక్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడంలో సాయపడతాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
2. కరివేపాకు
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. పలు నివేదికల ప్రకారం ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయి. ఇది చర్మంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. మీరు 7 లేదా 9 కరివేపాకులను తీసుకొని వాటిని ఉడకబెట్టి ఆ ద్రవాన్ని ఒక గ్లాసులో పోయండి. తర్వాత అందులో కొంచెం తేనె కలుపుకుని తాగండి. ఇలా చేయడం వల్ల పోషకాలు మన శరీరానికి అందుతాయి.
3. తులసి ఆకులు
తులసి చెట్టు వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలుసు. వాటి ఆకులు కూడా మనకు మేలు చేస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం తులసి ఆకులు రక్తం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు రోజూ ఖాళీ కడుపుతో వీటిని తినాలి. లేదా తులసి ఆకులతో టీ తయారు చేసుకుని కూడా తాగవచ్చు.