Best Herbal Teas to Reduce the Headache in Telugu:ఈ ఉరుకులు పరుగుల జీవనశైలితో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి.. వంటివి సహజం. ఇవి తలనొప్పికి దారితీస్తాయి. ఫలితంగా ఏ పనీ చేయాలనిపించదు. అలాగని ఓ మాత్ర వేసేసుకుంటే నిమిషాల్లో ఉపశమనం పొందచ్చు.. కానీ ప్రతిసారీ ఇలాగే చేస్తే మాత్రం దుష్ప్రభావాలతో పాటు పలు ఆరోగ్య సమస్యలూ తప్పవంటున్నారు నిపుణులు. అలాంటి సమయంలో తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే హెర్బల్ టీ లను తాగమని సలహాలు ఇస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
నిద్ర లేచింది మొదలు నిద్రపోయేవరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, తలనొప్పి ఇబ్బంది పెట్టినా.. ఓ కప్పు టీ తాగితే ఎక్కడ లేని ఉపశమనం లభిస్తోంది. అలాగే కూసింత ప్రశాంతత కూడా దొరుకుతుంది. మరి తలనొప్పిని తగ్గించే హెర్బల్ టీ లపై ఓ లుక్కేయండి..
మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా? - కాఫీని మాత్రం అస్సలు తాగొద్దు!
తులసి టీ..:విటమిన్ కే, ఏ లు పుష్కలంగా ఉంటాయి. గుప్పెడు తులసి ఆకుల్ని రెండు కప్పుల నీటిలో వేసి కప్పు నీరు అయ్యేంత వరకూ మరిగించాలి. ఈ పానీయాన్ని టీ లా తాగాలి. ఇది తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
అల్లం టీ:ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో పాటు నొప్పి నుంచి ఉపశమనాన్నిచ్చే రసాయన సమ్మేళనాలుంటాయి. మూడు గ్లాసుల నీటిలో చిన్న అల్లం ముక్క వేసి ఒకటిన్నర గ్లాసు అయ్యేవరకు మరిగించాలి. తర్వాత వడపోసి ఈ కషాయాన్ని తాగాలి. అల్లంలో ఉండే సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచి తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.
త్వరగా నిద్రలేవలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించారంటే అలారం లేకుండానే మేల్కొంటారు!
చామంతి టీ..:ఇందులో ఔషధ గుణాలు అధికం. చామంతి ఒత్తిడిని తగ్గిస్తుంది. వివిధ రకాల డైట్‌లలోనూ దీనిని ఉపయోగిస్తారు. కొన్ని చామంతి పూలను మూడు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. దింపాక నిమ్మరసం పిండి తాగితే సరి.