Children Health and Food Tips in Telugu :పిల్లల ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఆహారం, బట్టలు ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే పిల్లల ఎదుగుదలలో ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదగడానికి ప్రతిరోజూ తగినంత పోషకాహారం అవసరం అవుతుంది. చిన్నపిల్లల విషయంలో ఇది ఎక్కువ అవసరం. ఎందుకంటే 6 నెలల వయస్సులో పెరుగుదల వేగంగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ శక్తి, పోషకాలు అవసరం అవుతాయి. ఆరు నెలల తర్వాత చిన్నపిల్లలకు పాలతోపాటు.. ఆహారం తినిపించడం ప్రారంభించాలని వైద్యులు సూచిస్తారు.
హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఉదయాన్నే ఇవి తినండి - లేదంటే అంతే!
అలా వయసు పెరుగుతున్న కొద్దీ.. ఆహారాన్ని ఓ మోతాదులో పెంచుకుంటూ తినిపించాలని సూచిస్తారు. బాల్యంలో పిల్లలకు సరైన పోషకాలు అందిస్తేనే.. వారు పెద్దయ్యాక కూడా ఆరోగ్యంగా ఉంటారు. అయితే.. కొద్దిమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు మూడు సంవత్సరాల వయసు వచ్చినా కేవలం పెరుగన్నం, నెయ్యి, ఉప్పు కలిపి మెత్తగా చేసిన అన్నం పెడుతుంటారు. దానికి కారణం.. కారం పదార్థాలు ఇప్పటి నుంచే వద్దనే ఓ భావనలో ఉండిపోతారు. లేదంటే.. పిల్లలు తినట్లేదని వదిలేస్తారు. అయితే.. అది మంచి పద్ధతి కాదని పోషకాహార నిపుణులు అంటున్నారు.
13 ఏళ్లొచ్చినా పక్క తడుపుతున్నారా? - ఇలా చేయండి!
Best Health Tips for Kids: పిల్లలకు ఏడాది దాటిన తర్వాత నుంచి.. పెద్దలు ఏ ఆహారం తింటున్నారో.. అదే వాళ్లకూ అలవాటు చేయాలి. ఈ సమయంలో అలవాటు చేయకపోతే కౌమార దశకు వచ్చేసరికి ఇబ్బందులు మొదలవుతాయి. కొత్త వ్యక్తులతో మనం ఎలా బెరుకుగా ఉంటామో.. పిల్లలు కూడా కొత్త ఆహారం అంటే అలానే ఆలోచిస్తారు. అలా కాకుండా ఉండాలంటే పప్పు దినుసులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నూనెలు, పాలు, పెరుగు, గుడ్లు, మాంసాహారం, ధాన్యాలన్నీ ఇవ్వాలి. కానీ.. పెద్దవాళ్లు తినేదాంట్లో ఐదో వంతు మాత్రమే పెట్టాలి.