Best Foods to Reduce Migraine: ఒక వైపు మాత్రమే తీవ్రమైన తలనొప్పి.. చిరాకు, వాంతులు, వికారం, కంటిచూపు సరిగా ఉండకపోవడం.. వంటి లక్షణాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. సాధారణ తలనొప్పులతో పోలిస్తే.. మైగ్రేన్ గంటల నుంచి రోజుల పాటు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ సమస్యకు పూర్తి చికిత్స లేకపోయినా.. ఉపశమనానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. హెల్తీ ఫుడ్ తినడం వల్ల రిలీఫ్ పొందొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
మీరు నేల మీద పడుకోవడం లేదా? ఈ సమస్యలు వేధిస్తూనే ఉంటాయి!
పాలకూర:ఇతర ఆకుకూరలతో పోలిస్తే.. పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందులో ప్రొటీన్స్, పిండి పదార్థాలు, ఫైబర్ ఉన్నాయి. అంతేకాకుండా.. విటమిన్ A, విటమిన్ B6 వంటివి కూడా సమృద్ధిగా ఉన్నాయి. కాగా.. పాలకూరను ప్రతిరోజూ తినడం వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని 2019లో పర్డ్యూ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో స్పష్టమైంది.
ఓట్స్:బ్లడ్‌లో షుగర్ స్థాయిలు తగ్గినా మైగ్రేన్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. కాబట్టి ఓట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఓట్స్‌లో కావాల్సిన విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
మీ మోచేతులు నల్లగా మారాయా? - ఈ టిప్స్‌తో అందంగా మెరిసిపోవడం ఖాయం!
జీడిపప్పు:జీడిపప్పులో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ Eతో పాటు యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా అందులో ఉండే కాపర్ కూడా మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందడానికి ఉపయోగపడుతుంది. అలాగే బాదం, గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల మైగ్రేన్ మైగ్రేన్ తగ్గే అవకాశం ఉందని.. 2017లో మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ప్రకారం నిరూపితమైంది.