Best Food to Relief from Knee Pain in Telugu: ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పులు చిన్న వయసులోనే వస్తున్నాయి. సాధారణంగా వయసు పెరిగే కొద్ది ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు చిన్న ఏజ్‌లోనే వస్తున్నాయి. అయితే దీనికి కారణాలు అనేకం. జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్లు, సరైన ఆహారం తినకపోవడం వల్ల ఏర్పడుతున్నాయి. సాధారణంగా గాయాలు, ప్రమాదాల వల్ల మోకాళ్లలో నొప్పి రావడం సహజం. ఇక చలికాలంలో అవి ఇంకా ఎక్కువవుతాయి. అసలు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? చలికాలంలో వీటి నుంచి రిలీఫ్ పొందడం ఎలాగంటే..
మోకాలి నొప్పి ఎందుకు వస్తుంది?: శరీరంలో కాల్షియం లేదా ప్రోటీన్ లోపం కారణంగా మోకాలి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. వీటి లోపం వల్ల కొన్నిసార్లు కీళ్ల వాపులు రావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని పదార్థాలను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అవి ఏంటంటే..
పసుపు: యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్న పసుపు.. సహజంగానే ఆర్థరైటిస్ నివారణగా పనిచేస్తుంది. మోకాళ్ల నొప్పులను చాలావరకూ తగ్గిస్తుంది. కాబట్టి, రెగ్యులర్‌గా మీ ఫుడ్‌లో పసుపుని చేర్చవచ్చు. లేదంటే గోరువెచ్చని పాలల్లో పసుపును కలిపి తాగినా మంచి ఫలితం లభిస్తుంది. అలాగే పసుపును పేస్ట్‌లాగా చేసి నొప్పి ఉన్న దగ్గర అప్లై చేసిన రిలీఫ్ ఉంటుంది.
చలికాలంలో డేట్స్ తినడం వల్ల లాభాలు ఇవే!-తెలిస్తే వదిలిపెట్టరు సుమీ!
అల్లం: ప్రతి ఒక్కరి వంటగదిలో నిత్యం కనిపిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మోకాళ్ల నొప్పులను తగ్గించడానికి సూపర్‌ఫుడ్‌గా ఉపయోగపడుతుంది. తాజా అల్లం, శొంఠి రూపంలో రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. మీ రోజువారి ఆహారంలో అల్లాన్ని ఉపయోగించవచ్చు. అల్లం శరీరంలో వాపుని ప్రోత్సహించే పదార్థాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది.
వెల్లుల్లి: భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పి, వాపు తగ్గుతుంది. దానిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు పెయిన్స్ నుంచి రిలీఫ్ అందిస్తాయి.
పీరియడ్స్ నొప్పి భరించలేకున్నారా? ఈ ఫుడ్స్‌తో రిలీఫ్ పొందండి!