బరువు తగ్గేందుకు ప్రస్తుతం కాలంలో చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే బరువును అదుపులోకి తెచ్చుకునేందుకు జిమ్, వ్యాయామాలు చేస్తుంటారు కొందరు. మరికొందరు డైట్ చేయడం, రాత్రిపూట తక్కువ మోతాదులో అల్పాహారం తీసుకుంటున్నారు. అయితే బరువు తగ్గేందుకు అల్పహారం, లంచ్, డిన్నర్లో పాటించాల్సిన జాగ్రత్తలు గురించి ఓసారి తెలుసుకుందాం.
అల్పాహారం(టిఫిన్)..
పోషకాలతో కూడిన అల్పాహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అల్పాహారం అనేది పొద్దునే తినే ఆహారం. అది మన శరీర మెటబాలిజాన్ని పెంచడమే కాకుండా రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది. మెటాబాలిజం ఆకలి కలుగజేసే హర్మోన్లను నియంత్రిస్తుంది. చాలా సేపు ఆకలి లేకుండా చేస్తుంది. ఉదయం పూట టిఫిన్ తినకపోతే ఆకలి అధికంగా పెరిగి తర్వాత మనం ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటాం. అందుకే ఉదయం తప్పనిసరిగా అల్పాహారం తినాలి. అధిక ఫైబర్, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా ఎంచుకోవాలి. అలాగే నిద్రలేచిన మొదటి గంటలోనే టిఫిన్‌ను తినేయాలి. ఉదయం పూట టిఫిన్‌ను స్కిప్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే శరీరంలో మెటబాలిజం తగ్గిపోతుంది.
టిఫిన్‌లో తీసుకోవాల్సిన పదార్థాలు మధ్యాహ్న భోజనం
మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్, మాంసకృత్తులు, తృణధాన్యాలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందటమే కాకుండా సాయంత్రం వరకు కూడా ఆకలి వేయకుండా చేస్తుంది. మధ్యాహ్న భోజనాన్ని తినకపోవడం వల్ల రాత్రి సమయంలో ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటారు. అందువల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే మధ్యాహ్న భోజనాన్ని స్కిప్ చేయకుండా ఉండటమే మేలు. వీలైనంతవరకు సమతుల్యమైన ఆహారాన్ని తినాలి.
ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం సరైన సమయం ఎంతో ముఖ్యం
మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో లంచ్ చేస్తే మంచిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బిజీగా ఉండటం వల్ల మధ్యాహ్న భోజనాన్ని కొందరు తినరు. కానీ అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అనడంలో సందేహం లేదు. లంచ్ తినకపోతే మన శరీరంలో శక్తి తగ్గిపోవడం, నీరసంగా నిద్ర వచ్చినట్లు అనిపించడం లాంటి ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల సాయంత్రం లేదా రాత్రి ఎక్కువ మోతాదులో తింటారు. అందువల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే లంచ్‌లో వీలైనంత మంచి ఆహారాన్ని సరైన సమయానికి తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు.
రాత్రి భోజనం
బరువును నియంత్రించడంలో రాత్రి భోజనానిది కీలక పాత్ర. డిన్నర్లో తక్కువ మోతాదులో తినడం మంచిదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాత్రి సమయంలో నిద్ర పోవడం వల్ల క్యాలరీలు ఖర్చు కాకపోవడం వల్ల బరువు పెరుగుతారని హెచ్చరిస్తున్నారు. అందుకే రాత్రి సమయంలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. నిద్రకు కనీసం 3 లేదా 4 గంటల ముందు డిన్నర్ చేయడం ఆరోగ్యానికి మేలు.. అలాగే బరువు తగ్గడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. ఆలస్యంగా డిన్నర్ తినడం వల్ల స్థూలకాయం, డైస్లిపిడెమియా, హైపర్గ్లైసీమియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సూప్, గ్రిల్డ్ చికెన్, ఫిష్, సలాడ్లు, పాలక్ పనీర్‌తో కూడిన మల్టీగ్రెయిన్ రోటీ, ఉడకబెట్టిన చనా మసాలా రాత్రి భోజనానికి చాలా మంచివని నిపుణులు అంటున్నారు.
రాత్రిపూట తీసుకోవాల్సిన ఆహారం పాటించండిలా
బరువు తగ్గాలనుకునేవారికి ఆహార నియమాలు చాలా ముఖ్యం. కొద్ది మోతాదులో రోజుకు మూడు సార్లు తినాలి. మధ్యలో ఆకలి వేసినప్పుడు జ్యూస్‌లు, పండ్లు, స్నాక్స్‌లాంటివి తినాలి. అధిక క్యాలరీలు ఉండే అహారానికి దూరంగా ఉండడం చాలా మంచిది. తక్కువ క్యాలరీలు ఉండి.. పోషకాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బరువును తగ్గవచ్చు.