Best Foods for Reduce Under Eye Dark Circles :కొందరి ముఖం జీవం కోల్పోయినట్టుగా కనిపిస్తుంది.. మరికొందరి ఫేస్ బాగానే ఉన్నా.. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. ఇవి అందాన్ని పాడుచేస్తున్నాయని జనం ఇబ్బంది పడతారు. మహిళల బాధ వర్ణనాతీతం. వీటిని తొలగించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. అయినా.. ఫలితం సరిగా కనిపించదు. ఇలాంటి వారికి అద్బుతమైన డైట్ సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు. మరి, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సిట్రస్ జాతి పండ్లు తినాలి :చాలా మంది పని ఒత్తిడిలో పడి సరైన ఫుడ్ తీసుకోవడంపై అంతగా దృష్టిపెట్టరు. దీంతో కళ్ల కింద నల్లటి వలయాలు వస్తుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడేవారు ఎక్కువగా విటమిన్ C ఉండే ఆహార పదార్థాలను తినాలి. ఎందుకంటే.. విటమిన్ సీ అనేది ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించి నల్లటి మచ్చలు ఏర్పడకుండా కాపాడుతుంది. అందుకోసం.. మీరు రోజూ వారి ఆహారంలో నిమ్మ, ఉసిరి, క్యాప్సికం, కివీ, బెర్రీలు, జామకాయలు, కమలాలు లాంటివి ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా లైకోపీన్ అనేది కూడా మన చర్మాన్ని పిగ్మంటేషన్ నుంచి కాపాడుతుంది. టమోటాలు, క్యాప్సికం, క్యారెట్లు, జామ, పుచ్చకాయలు వంటి వాటిలో ఇది పుష్కలంగా ఉంటుంది.
ఆకు కూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి :మన శరీరంలోని కణ జాలాలన్నింటికీ పుష్కలంగా ఆక్సిజన్ సరఫరా కావాలంటే.. అందుకు సరిపడినంత ఐరన్ కూడా బాడీలో ఉండాలి. బచ్చలికూర, పాలకూర, ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, ఆకు కూరల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. వీటిలో ఏదో ఒకటి డైలీ డైట్లో ఉండేలా ప్లాన్ వేసుకోండి.
How To Look Young Forever : ఆరు పదుల వయసులోనూ యవ్వనంగా కనిపించాలా?.. ఈ 10 టిప్స్ పాటిస్తే చాలు!