Best Food For Liver Health : మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. శరీరంలోని రెండోవ అతి పెద్ద అవయవం కూడా ఇదే. ఆరోగ్యాన్ని కాపాడడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తం నుంచి విషపదార్థాలను తొలగించడానికి ఇది సహాయపడుతుంది. కాలేయం బైల్ అనే ఫిజియోలాజికల్ ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది షుగర్ స్ధాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన రక్తాన్ని శరీరానికి అందించడంలో కాలేయానిదే కీలక పాత్ర.
జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి వల్ల ఇటీవల కాలంలో చాలా మంది కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. కాలేయ సమస్యల వల్ల మధుమేహంతో పాటు అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. మంచి ఆహారం తీసుకోవడం వల్ల కాలేయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాలేయ సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.
Liver Healthy Food : శరీరంలోని ముఖ్య అవయవమైన కాలేయాన్ని ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. కాలేయ సంరక్షణగా ఉంచుకోవడానికి కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలతో పాటు ప్రోటీన్ అందించే చికెన్, చేపలు, బీన్స్ వంటి వాటిని తీసుకోవాలి. అలాగే ద్రాక్షపండ్లు తినడం కూడా మంచిదే.
ద్రాక్షతో మేలు..
ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయం దెబ్బతినకుండా రక్షిస్తాయి. అలాగే కాలేయ పని తీరును మెరుగుపర్చడంలో ద్రాక్షరసం బాగా ఉపయోగపడుతుంది. లివర్ సమస్యల బారిన పడకుండాఉండాలంటే ద్రాక్షరసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.