Best Diet Plan For Diabetic Patients :గంటల తరబడికూర్చొని పని చేయడం, వ్యాయామం చేయకపోవడం, ఆహారపు అలవాట్లు, ఇంకా వంశపారంపర్యం.. ఇవా పలు కారణాలతో షుగర్ వ్యాధి మనుషుల ఒంట్లోకి ప్రవేశిస్తోంది. ఇది ఒక్కసారి వస్తే అంతే.. లైఫ్ టైమ్ బెర్త్ కన్ఫామ్! ఎంత అధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా.. ఈ వ్యాధిని పూర్తిగా నివారించే మందులు మాత్రం అందుబాటులో లేవు. అయితే.. ఈ వ్యాధి ఉన్న వారు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకు కూరలు..
షుగర్ వ్యాధి ఉన్న వారు రోజూవారి ఆహారంలో ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పాలకూరలో (Spinach) మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయని, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఆకుకూరల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినడాన్ని నివారిస్తాయని.. అందుకే వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!
ఉడికించిన ఆహారం తీసుకోండి..
మనం వంట చేసే విధానం కూడా ఆహారంలోని పోషక విలువలను మారుస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే షుగర్ పేషెంట్‌లు వేయించిన ఆహారానికి బదులుగా, ఉడకబెట్టిన ఫుడ్స్ తినడానికే ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. ఆహారం వేయించడం వల్ల దానిలోని పోషక విలువలు తగ్గుతాయి, క్యాలరీలు పెరుగుతాయి. కాబట్టి, షుగర్ ఉన్న వారు పోషకాలు ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.