తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రుమటాయిడ్ ఆర్థరైటిస్​తో​ ఇబ్బందా? ఈ ఆయుర్వేద రెమిడీతో ఈజీగా రిలీఫ్​!

Ayurvedic Remedy for Rheumatoid Arthritis : అవయవాలు అన్నీ సక్రమంగా ఉంటేనే పనులు చేసుకోవడానికి ఆపసోపాలు పడుతుంటాం. అలాంటిది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. కనీసం కాళ్లు, చేతులు కూడా కదపలేని పరిస్థితి. దీని నివారణకు అనేక ఆధునిక పద్ధతులు ఉన్నా.. ఈ ఆయుర్వేద చికిత్స ట్రై చేశారంటే చాలా వరకు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. అదెంటో ఇప్పుడు చూద్దాం..

Arthritis
Arthritis

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 2:14 PM IST

Best Ayurvedic Remedy for Rheumatoid Arthritis : నిత్య జీవితంలో కూర్చోవడం, లేవడం, నడవడం, పడుకోవడం.. లాంటి కదలికలన్నీ చాలా సులువుగా జరిగిపోతాయి. కానీ, అదే ఒకసారి రుమటాయిడ్‌ ఆర్థరైటిస్(కీళ్ల వాతం)వచ్చిందంటే.. ఈ చిన్న చిన్న పనులే అతి కష్టంగా మారుతాయి. దీని బారిన పడ్డామంటే నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కొందరైతే దీని నుంచి రిలీఫ్​ పొందేందుకు వేలకు వేలు ఖర్చు పెడుతున్నా.. ఫలితం అంతంతమాత్రమే. అలాంటి వారి కోసం ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అద్భుతమైన దివ్య జౌషధం సూచిస్తున్నారు. దీనిని వాడారంటే కీళ్ల వాతంతో పాటు ఇతర కీళ్ల నొప్పులను చాలా వరకు తగ్గించుకోవచ్చంటున్నారు. ఇంతకీ ఏంటి ఆ ఔషధం? దానిని ఎలా తయారుచేసుకోవాలి? ఏ విధంగా యూజ్ చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Rheumatoid Arthritis :రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకొస్తుందో సరైన కారణం తెలియకపోయినా దాని వల్ల కలిగే బాధ మామూలుగా ఉండదు. ఇది వచ్చిందంటే చాలు ఉదయం లేవగానే కీళ్లన్నీ పట్టేస్తాయి. దాంతో కూర్చోవడం, లేవడం కష్టంగా మారుతుంది. కీళ్ల వాతం ఒక రకమైన ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇది వస్తే కీళ్ల దగ్గర నొప్పి, వాపు, మంట ఉంటుంది. కొంతమందిలో దీనికి త్వరగా ట్రీట్​మెంట్ తీసుకోకపోతే.. కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలు వంటి అనేక రకాల శరీర వ్యవస్థలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీనికి చికిత్సగా ఆధునిక మందులు ఉన్నప్పటికీ.. ఈ ఆయుర్వేద రెమిడీ చాలా బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కీళ్ల వాతానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన రెమిడీ ఏంటంటే.. ఆముదం మొక్క ఆకులతో తయారుచేసిన పేస్ట్. సాధారణంగా ఈ మొక్కలో ఎన్నో రకాల జౌషధ గుణాలు నిండి ఉన్నాయి. ఆయుర్వేద వైద్యులు దీనిని వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు వినియోగిస్తుంటారు. ఆయుర్వేదంలో ఈ మొక్కను ఎరండా, పంచాంగుల అని కూడా పిలుస్తారు. ఆముదం మొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలు కీళ్ల వాతం వల్ల కలిగే నొప్పి, వాపు, ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇకపోతే కీళ్లవాతానికి ఉపయోగించే ఈ పేస్ట్ ఎలా తయారుచేసుకోవాలంటే..

తయారీ, ఉపయోగించే విధానం :ముందుగా మీరు కొన్ని ఆముదం మొక్క ఆకులను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటికి హిమాలయన్ పింక్ సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా వాటర్​ వేసుకుని పేస్ట్​లాగా చేసుకోవాలి. అనంతరం దానిని కాస్త వేడిచేసి మీకు ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ ఈ పేస్ట్​ను అప్లై చేయాలి. అవసరమైతే ఈ పేస్ట్​ను బ్యాండేజ్​తో కప్పుకోవడం బెటర్. అలా 30 నిమిషాలు ఉంచి.. ఆపై నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనిని రోజుకు రెండు లేదా మూడుసార్లు ఇలా అప్లై చేసుకోవచ్చు. చీలమండలు, మోచేతులు, మెడ మొదలైన ప్లేసేస్​ దగ్గర వాపు తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

తరచూ తల వెనుక నొప్పి వస్తుందా.. అయితే కారణాలు ఇవే కావొచ్చు!

ఇది వాడే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు..

  • దీనిని మీ చర్మానికి అప్లై చేసే ముందు.. మీ చేతిపై కొద్దిగా పరీక్షించుకోవడం బెటర్. అప్పుడు ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే ఈ పేస్ట్​ను ఉపయోగించవద్దు.
  • అలాగే పేస్ట్‌ను మీ కళ్లలోకి దగ్గర పెట్టుకోవద్దు.
  • మీరు గర్భిణీగా ఉన్నట్లయితే లేదా ఏదైనా ఇతర వైద్యానికి ట్రీట్​మెంట్ తీసుకుంటున్నట్లయితే.. ఆముదం మొక్క పేస్ట్‌ను ఉపయోగించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

కీలు కీలులో నరకం.. ఇలా చేస్తే ఆర్థ్రయిటిస్‌ నుంచి ఉపశమనం!

health tips in telugu: తరుచూ ఆ సమస్యలు వేధిస్తున్నాయా? ఇలా చేయండి మరి..!

ABOUT THE AUTHOR

...view details