తెలంగాణ

telangana

వయసు పెరిగినా యంగ్​గా కనిపించాలా? - ఈ 4 వర్కౌట్స్ చేస్తే రిజల్ట్ పక్కా!

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 1:35 PM IST

Best Anti Aging Exercises : ప్రతి ఒక్కరిలో వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. కానీ, చాలా మంది యంగ్​గా కనిపించడానికి ఏవేవో సర్జరీలు చేయించుకుంటారు. తర్వాత సరైన ఫలితాలు రాక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అలా కాకుండా ఈ 4 వర్కౌట్స్ రెగ్యులర్​గా చేస్తే మంచి రిజల్ట్స్ పక్కా అంటున్నారు నిపుణులు! అవేంటో ఇప్పుడు చూద్దాం..

Best Anti Aging Exercises
Best Anti Aging Exercises

Best Anti Aging Exercises in Telugu :ఎవరిలోనైనా వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం. చర్మం ముడతలు పడటం, జుట్టు తెల్ల రంగులోకి మారటం లాంటి వాటిని అందరూ గమనిస్తుంటారు. అయితే చాలా మంది వయసు పెరుగుతున్నా యంగ్​గా ఉండడంతో పాటు అందంగా కనిపించాలనుకుంటారు. అందుకోసం చాలా మంది సర్జరీలు చేయించుకుంటారు. అలా కాకుండా సహజంగానే స్లిమ్​గా కనిపించాలంటే మన లైఫ్​స్టైల్ సరిగ్గా ఉండాలి. అందుకోసం సరైన ఆహారం((Anti Aging Food) తీసుకోవడం, టైమ్​కి నిద్రపోవడం, మంచి అలవాట్లను పాటించడం లాంటివి చేయాలి. ఇలాంటివి ఫాలో అయితే ఎలాంటి సర్జరీలు అవసరం లేకుండానే ఓల్డ్ ఏజ్​లోనూ యువకుడిగా కనిపిస్తారంటున్నారు నిపుణులు. అందుకు చేయాల్సిందల్లా పైన పేర్కొన్న వాటితో పాటు డైలీ 4 వర్కౌట్స్ చేయడం. మరి, అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వాకింగ్ : డైలీ వాకింగ్ అనేది మంచి హెల్దీ బెనిఫిట్స్‌ని ఇస్తోంది. రెగ్యులర్‌గా బ్రిస్క్ వాక్ చేస్తే గుండె ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. దీనిని అలవాటు చేసుకుంటే.. బరువు మెంటెయిన్ చేయడమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఈజీగా చేసే వర్కౌట్. దీనిని ఎవరైనా ఏ టైమ్‌లో అయినా చేయొచ్చు. సుమారు రోజుకి 6వేల నుంచి 10 వేల అడుగు వేస్తే ఫిట్‌గా, యవ్వనంగా ఉంటారు.

రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజ్ : రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజ్ చేయడం అనేది కూడా మెరుగైన వర్కౌట్​గా చెప్పుకోవచ్చు. ఈ ఎక్సర్​సైజ్ కండరాలని బలంగా చేస్తుంది. దీనిలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్, బాడీ వెయిట్ వర్కౌట్ కండరాలకి మంచిది. ఈ వర్కౌట్ జీవక్రియని మెరుగ్గా చేసి బరువు నియంత్రణలో సాయపడుతుంది. డైలీ దీనిని చేస్తే బాడీ టోన్ అవుతుంది. అలాగే యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

30+ ఏజ్​లోనే ముఖంపై ముడతలా? ఈ సింపుల్​ ఎక్సర్​సైజ్​లతో మాయం!

యోగా :యంగ్​గా కనిపించడానికి యోగా కూడా బెటర్ వర్కౌట్. రెగ్యులర్​గా యోగా చేస్తే మంచి పోశ్చర్, బ్రీథింగ్ కంట్రోల్, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్సింగ్‌తో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే డైలీ యోగా చేస్తే ఒత్తిడి తగ్గి మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గడం ద్వారా యవ్వనంగా కనిపిస్తారు.

స్విమ్మింగ్ : స్లిమ్​గా కనిపించడానికి మరో బెస్ట్ వర్కౌట్ స్విమ్మింగ్. ఇది బాడీ మొత్తానికి వర్కౌట్ అందించడమే కాకుండా ఎన్నో లాభాలని ఇస్తుంది. స్విమ్మింగ్ చేయడం ద్వారా కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి బెస్ట్ వర్కౌట్ ఇది. అలాగే స్విమ్మింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం పెరిగి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అంతేకాకుండా బ్రీథింగ్‌ని కూడా సరిచేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగ్గా చేస్తుంది. వీటన్నింటితో పాటు స్విమ్మింగ్ చేస్తే యంగ్​గా కనిపిస్తారు.

నోట్ :అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ స్టోరీ కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం ద్వారా ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడం ఉత్తమ మార్గమని గమనించగలరు.

ఈ ఆహారంతో ఎప్పటికీ యవ్వనమే..

Belly Fat Burning Floor Exercises : జిమ్​కు వెళ్లకుండానే పొట్ట తగ్గాలా?.. ఈ ఫ్లోర్​ ఎక్స్​ర్​సైజ్​లు​ ట్రై​ చేయండి!

ABOUT THE AUTHOR

...view details