పాలకూర తింటే.. ఎంత మేలో తెలుసుకోండి! - spinach uses
నేస్తాలూ బాగున్నారా! నేను మీ పాలకూరను. ఆకుకూరల్లో తోటకూర తర్వాత ఎక్కువగా వినిపించేది నా పేరే. నన్ను తినడానికి మీలో కొందరు ఇష్టపడరు. కానీ నావల్ల మీకు బోలెడన్ని లాభాలున్నాయి. నాలో ఒకటి కాదు. రెండు కాదు. దాదాపు 13 రకాల యాంటీయాక్సిడెంట్లున్నాయి. ఇవి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. నాలో విటమిన్ కె ఎక్కువగా లభిస్తుంది. ఇంకా ఏమేమి ఉంటాయో మీరే చూడండి.
పాలకూర తింటే.. ఎంత మేలో తెలుసుకోండి!
ఒక వంద గ్రాముల పాలకూరలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసుకోండి.
- కేలరీలు: 23
- కార్బోహైడ్రేట్లు: 3.6గ్రాములు
- చక్కెర: 0.4 గ్రాములు
- పీచుపదార్థం: 2.2 గ్రాములు
- కొవ్వు: 0.4 గ్రాములు
- ప్రొటీన్లు: 2.9 గ్రాములు
- విటమిన్లు: ఎ, సి, ఇ, కె,
- ఖనిజాలు: కాల్షియం, ఇనుము