Benefits of Sleeping on the Floor in Telugu :ఖరీదైన బెడ్.. దానిపై మెత్తని పరుపు.. అడిషనల్‌గా దిండు.. ఇవి లేకపోతే చాలా మందికి నిద్ర రాదు. "మా పరుపు కొనండి.. సుఖాల్లో తేలిపోండి" అంటూ యాడ్స్‌లో ఊదరగొడుతుంటాయి పలు కంపెనీలు. కానీ.. ఈ "సుఖం" ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. పరుపులన్నీ పక్కన విసిరేసి.. నేలపై బెడ్‌షీట్ వేసుకొని పడుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఎన్నోరకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని.. హెల్దీ లైఫ్‌ను లీడ్ చేయొచ్చని అంటున్నారు. మరి.. ఆ వివరాలేంటో చూడండి.
భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడిస్తే మంచిదా ? ఆయుర్వేదం ఏం చెబుతుంది!
నేలపై ఇలా పడుకోవాలి:నేలపై చాప లేదా బెడ్ షీట్ వేసి పడుకోండి. ఒక పక్కకు తిరిగి పడుకోవాలంటే.. ఎడమవైపు తిరిగి పడుకుంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణం కూడా తొందరగా అవుతుంది. నేలపై పడుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడుకు ఆక్సీజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది. కొంతమందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల నడుము, వీపు, భుజం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.
మృతకణాలు పోయి ముఖం అందంగా మారాలా? ఈ స్క్రబ్బర్స్‌తో ప్రాబ్లం సాల్వ్!
వెన్నునొప్పికి చెక్:మీకు స్ట్రెస్ లేదా ఇతర కారణాల వల్ల వెన్నునొప్పి వస్తుందా? అయితే.. ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకుంటే మీరు నేలపై పడుకోండి. నిద్ర భంగిమల్లో మార్పుల వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశముంది. అయితే.. నేల మీద పడుకోవడం వల్ల మీ నిద్ర భంగిమ కరెక్ట్‌గా ఉంటుంది. అంతేకాకుండా.. మీ హిప్ ఫ్లెక్సర్లు, హామ్ స్ట్రింగ్స్కు ఉపశమనం లభించి.. నడుము నొప్పి తగ్గుతుంది.
కరెక్ట్ పోస్టర్:చాలా మంది నిటారుగా కాకుండా.. వంగి కూర్చోంటారు. ఇలాంటి పోస్టర్ మీకు నడుము నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా మెడ వెనుక భాగంలో శరీరం ఎత్తుగా మారుతుంది. ఈ సమస్య మీలో ఉంటే నేలపై పడుకోవడం ఉత్తమం. ఇది మీ మెడ, తలను సరైన అమరికలోకి తీసుకువస్తుంది. తద్వార మీ భంగిమ మెరుగుపడుతుంది. అంతేకాకుండా వెన్ను నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.