Benefits of running daily: వ్యాయామం చేయటానికి సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? ఎక్కువగా కాదు, కనీసం 10 నిమిషాలు కేటాయించినా చాలు. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఒకమాదిరి వేగంతో పది నిమిషాలు పరుగెత్తినా మెదడులో మూడ్‌ను, జ్ఞాపకశక్తిని, ఆలోచనల తీరును నియంత్రించే భాగానికి రక్త ప్రసరణ పుంజుకుంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ సుకుబ అధ్యయనం పేర్కొంటోంది మరి.
10 నిమిషాల పరుగుతో.. 'మూడ్' మారిపోవాల్సిందే! - వ్యాయామాలతో లాభాలు
Benefits of running daily: రోజుకు కనీసం 10నిమిషాలు పరిగెత్తితే.. మూడ్ మారిపోతుందని, మెదడు చురుకుగా పనిచేస్తుందని ఓ అధ్యయనం పేర్కొంది. వ్యాయామం చేస్తే.. మనసుకు హాయిని చేకూర్చే ఎండార్ఫిన్లనే హార్మోన్లు విడుదలవుతాయని తెలిపింది.
10 నిమిషాల పరుగుతో.. 'మూడ్' మారిపోవాల్సిందే!
పరుగెడుతున్నప్పుడు శరీర నియంత్రణ, కదలికలు, వేగం వంటివనీ ఒక సమన్వయంతో సాగుతాయి. ఇవి మెదడు చురుకుగా పనిచేయటానికీ తోడ్పడతాయి. వ్యాయామం చేసినప్పుడు మనసుకు హాయిని చేకూర్చే ఎండార్ఫిన్లనే హార్మోన్లూ విడుదలవుతాయి. ఇవి మూడ్ మెరుగుపడటానికి దోహదం చేస్తాయి.
ఇదీ చూడండి:-ఇలా చేస్తే మడమ నొప్పి మాయం!