తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

దానిమ్మలో దాగివున్న పోషకాల గురించి మీకు తెలుసా? - దానిమ్మతో ఆరోగ్యం

ఎర్రని దానిమ్మ గింజలను చూడగానే చటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. ఎంతో ఆకర్షణీయంగా కనిపించే దానిమ్మలో రుచితోపాటు పోషకాలూ అధికమే.. అవేంటో తెలుసుకుందాం.

Benefits of Pomegranate in telugu
దానిమ్మలో దాగివున్న పోషకాల గురించి మీకు తెలుసా?

By

Published : Jul 23, 2020, 9:59 AM IST

దానిమ్మలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్‌-ఎ, సి, బి6, ఐరన్‌, పీచు లాంటి ఎన్నో పోషకాలుంటాయి.

  • యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌-ఎ, సి పుష్కలంగా ఉండటం వల్ల రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుతుంది.
  • రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండె జబ్బుల బారిన పడకుండా చేస్తుంది.
  • బ్యాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి జలుబు నుంచి రక్షణ కల్పిస్తుంది.
  • రక్తహీనతను నివారిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
  • రక్తనాళాల్లో ఉండే అడ్డంకులనుతొలగించి రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది.
  • దీంట్లోని క్యాల్షియం ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది.
  • చిగుళ్లవాపు, నొప్పి లాంటి దంత సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది.
  • నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నప్పుడు దీని రసం తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

ABOUT THE AUTHOR

...view details