పండగ ఏదైనా.. ప్రతి వంటింట్లో తప్పకుండా చేరే పదార్థం బెల్లం. పిండివంటలకు రుచిని తెచ్చే బెల్లానికి.. అనారోగ్యాలని దరిచేరకుండా చేసే శక్తీ ఉంది.
- బెల్లం జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేసి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అందుకే చాలా మంది భోజనం తర్వాత బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటారు.
- ఇది డిటాక్స్‌లా పనిచేసి శరీరంలోని వ్యర్థాలు, విషాలను బయటకు పంపేస్తుంది. అంతేకాదు రోగనిరోధకతను పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది.
- మహిళలు రోజూ కొద్దిగా బెల్లం తినడం వల్ల నెలసరి ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- బెల్లం తిన్న వెంటనే శక్తి లభిస్తుంది. ఇది చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది.
- ఈ తీపి పదార్థంలో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, సెలీనియమ్ లాంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మనకు హాని చేసే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయి.
- దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
- బెల్లంలో ఇనుము, ఫోలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకుంటే రక్తహీనత సమస్య దరిచేరదు. అనీమియాతో బాధపడే మహిళలు దీన్ని తమ ఆహారంలో చేర్చుకుంటే సరి. అలాగే గర్భిణులు కూడా.