Benefits of Drinking Water When You Wake Up:రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే మార్నింగ్ నిద్ర లేవగానే చేయాల్సిన పని ఒక గ్లాసు నీళ్లు తాగడం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. సరైన ఆహారం, తగినంత నిద్ర మన బాడీకి ఎంత అవసరమో.. సరిపడ నీరు తాగడం కూడా అంతే ముఖ్యం. అందుకే అంటారు నీరు జీవనాధారం అని. శరీరంలో సుమారు 60 శాతం నీరు ఉంటుంది. అయితే ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇప్పుడు చూద్దాం..
శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది:రాత్రంతా నిద్ర పోవడం వల్ల బాడీకి సరిపడా నీళ్లు అందకా.. డీహైడ్రేట్‌కి గురవుతారు. అందుకే ఉదయం లేచిన వెంటనే నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా మారిపోతుంది. దీని మీద కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి.
జీవక్రియ మెరుగు:ఉదయాన్నే నీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది మరింత బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఖాళీ కడుపుతో నీరు తాగడం ద్వారా, జీవక్రియను 24 శాతం వేగవంతం చేయవచ్చు.
మలబద్ధకం నివారణ కోసం మందులు వాడుతున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!
హార్ట్ బర్న్ నుంచి ఉపశమనం:ఒక వ్యక్తి రాత్రి సమయంలో చాలా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు లేదా ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు యాసిడ్ రిఫ్లక్స్, హార్ట్ బర్న్ సంభవించవచ్చు. నిద్రలేచిన తర్వాత ముందుగా నీరు తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపర్చవచ్చు. తద్వారా ఈ సమస్యను అరికట్టడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడం కోసం:క్రమం తప్పకుండా నీటిని తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఉదయాన్నే నీరు తాగితే అదనంగా 48 కేలరీలు బర్న్ అవుతాయని ఒక అధ్యయనం వెల్లడించింది. అలాగే సంవత్సరం పాటు ఉదయం పూట నీరు తాగితే 17వేల అదనపు కేలరీలు ఖర్చు అవుతాయి. అంతే దాదాపు 2.5 కేజీల కొవ్వు కరిగిపోతుంది.
ఎగ్స్ Vs పనీర్- ఏది మంచిది? ఎందులో ప్రొటీన్ ఎక్కువ!
రోగనిరోధక శక్తి:ఉదయం పూట నీరు తాగడం వల్ల కడుపు నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది శోషరస వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. కాలక్రమేణా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది వ్యక్తిని మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురిచేసే సమస్య నుంచి కూడా కాపాడుతుంది.