తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రోజూ కాఫీ తాగితే అన్ని ప్రయోజనాలా..! - కాఫీ అలవాటు

Coffee Benefits: సాధారణంగా మంచి నీళ్ల తర్వాత ఎక్కువగా తాగే పానీయాలు టీ,కాఫీలు. కొందరికైతే రోజుకి మూడు నాలుగు సార్లు ఇవి ఉండాల్సిందే. కొంతమంది మాత్రం అది దురలవాటుగా భావిస్తారు. మరికొంతమంది ఆరోగ్యానికి మంచిదంటారు. ఇందులో నిజమెంత? నిపుణులు ఏమంటున్నారంటే?

benefits of drinking coffee
benefits of drinking coffee

By

Published : May 30, 2022, 7:16 AM IST

Coffee Benefits: వేడివేడిగా పొగ‌లు క‌క్కే కాఫీ తాగ‌డ‌మంటే చాలామందికి ఇష్టం. ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీ పడితేనే ఆరోజు ప్రారంభం అయినట్లు చాలా మంది భావిస్తారు. కాఫీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు, రుచి ఉంది. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. అలాగే తలనొప్పికి కూడా గురువుతుంటారు. ఇంకా చాలా సమస్యలతో బాధపడుతుంటారు. వీటన్నింటి నుంచి ఉపశమనం కలిగించడానికి కాఫీ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కెఫిన్ దివ్య ఔషధంగా పని చేస్తుంది. పలు వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాదండోయ్​.. కాఫీ తాగితే మీరు శృంగార సమయంలో ఉరకలేస్తారంట. కాఫీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నా దీన్ని మోతాదుకు మించి తాగడం కూడా మంచిది కాదని గుర్తుంచుకోండి. మీరు ఏవైనా వ్యాధులతో బాధపడుతుంటే దీన్ని తీసుకునే ముందు ఒకసారి డాక్టర్లను కూడా సంప్రదించాలి. ఇక కాఫీ వల్ల ఉండే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలనూ మీరూ తెలుసుకోండి.

  • మెదడు చురుగ్గా పని చేసేటట్లు చేస్తుంది
  • జ్ఞాపకశక్తి పెరుగుతుంది
  • తలనొప్పి తగ్గుతుంది
  • డయాబెటిస్ రిస్క్ కాస్త తగ్గిస్తుంది
  • కాలేయానికి బాగా ఉపయోగపడుతుంది
  • కంటి చూపును మెరుగుపరుస్తుంది
  • క్యాన్సర్​కు చెక్ పెడుతుంది
  • బరువు తగ్గుతారు
  • దీర్ఘాయువు
  • ఆందోళనను తగ్గిస్తుంది
  • నొప్పిని తగ్గిస్తుంది
  • మలబద్దకం సమస్య పరిష్కారం అవుతుంది
  • బ్రెయిన్ డిసీజెస్​ను తగ్గిస్తుంది

"కాఫీలో కెఫిన్ కంటెంట్ మీ మెదడు కణాలను ఎక్కువ ఉత్తేజితంగా మారుస్తుంది. దీంతో మెదడు సంబంధిత వ్యాధుల బారిన మీరు పడే అవకాశం ఉండదు. డిమెంటియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన మీరుపడకుండా కాఫీ కాపాడుతుంది. అందువల్ల రోజూ ఒక కప్పు కాఫీ తాగండి. ఆరోగ్యంగా ఉండండి." అని నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details