తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

జ్ఞాపకశక్తి తగ్గుతుందా... ఓ సారి ఇది ట్రై చేయండి! - నల్ల వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు

మీరు నల్ల వెల్లుల్లి తింటున్నారా... అదేంటి వెల్లుల్లి తెల్లగా ఉంటుంది కదా అనుకుంటున్నారా..? ఈ నల్ల వెల్లుల్లి ప్రత్యేకంగా దొరకదు. దీనిని ఓ పద్ధతిలో నిల్వచేయడం ద్వారా తయారు చేస్తారు. ఇది తింటే ఒంటికి చాలా మంచిదట. మీరు ఓసారి ట్రై చేయండి.

Benefits of black garlic in telugu
జ్ఞాపకశక్తి తగ్గుతుందా... అయితే ఇది ఓసారి ట్రై చేయండి!

By

Published : Jun 4, 2020, 2:43 PM IST

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది, కానీ నల్ల వెల్లుల్లి ఇంకా మంచిది అనేది కొత్తగా వస్తున్న వార్త. ఈ నల్ల వెల్లుల్లి ప్రత్యేకంగా పండదు. ఒక పద్ధతిలో నిల్వచేయడం లేదా అధిక ఉష్ణోగ్రతకు గురిచేయడం ద్వారా నల్లబడేలా చేస్తారు. ఇలా చేసిన వెల్లుల్లి తియ్యగా జెల్లీలా సాగుతుంది.

సాధారణ వెల్లుల్లికి ఉండే ఘాటూ వాసనా కూడా తగ్గుతాయి. కానీ పోషకాలు అలానే ఉంటాయి. దీనివల్ల ఆహారం రుచి పెరుగుతుంది. మామూలు వెల్లుల్లితో పోలిస్తే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ప్రొటీన్‌, పీచు, ఐరన్‌, విటమిన్‌-సి, కాల్షియం కూడా అధిక శాతంలోనే ఉంటాయి. అందుకే జపాన్‌, థాయ్‌ల్యాండ్‌, దక్షిణ కొరియాల్లో ఈ నల్ల వెల్లుల్లినే ఎక్కువగా వాడతారట. ఇందులో సాలైల్‌ సిస్టీన్‌ అనే పదార్థం ఎక్కువగా ఉండటంతో కణాల్లో ఆక్సీకరణ ఒత్తిడి, మంట ఏర్పడకుండా ఉంటాయి. పాలీఫినాల్స్‌ కూడా ఐదు రెట్లు ఎక్కువ.

నల్ల వెల్లుల్లి నాడీ వ్యవస్థని ప్రభావితం చేయడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఆల్జీమర్స్‌ని రానివ్వదు. కాలేయ పనితీరు బాగుంటుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వుని తగ్గిస్తుంది. దీన్ని ఆహారంలో తీసుకుంటే రక్తప్రసరణ పెరిగి గుండె పనితీరు బాగున్నట్లు తేలిందట. మధుమేహం నుంచీ రక్షిస్తుంది. పేగు, లుకేమియా క్యాన్సర్‌ కణాల పెరుగుదలనీ అడ్డుకుంటుందట.

ఇదీ చూడండి:వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

ABOUT THE AUTHOR

...view details