Benefits Of Ash Gourd Juice :బూడిద గుమ్మడికాయకు హిందూ సంప్రదాయాలలోనూ, ఔషధపరంగానూ ఎంతో ప్రాధాన్యం ఉంది. బూడిద గుమ్మడికాయలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కడుపు ఉబ్బరం, మంటగా ఉన్నప్పుడు బూడిద గుమ్మడి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. కాయలోనే కాదు, చెట్టు అణువణువులో ఆరోగ్యాన్ని సంరక్షించే పోషకాలు ఉన్నాయి. విత్తనాల్లోనూ, తీగలోనూ అధిక పోషక విలువలు ఉంటాయి. అందులో ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ రసం చేసి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బూడిద గుమ్మడికాయ రసాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
బూడిద గుమ్మడికాయ రసం చేసే విధానం :
కావలసినవి :
- ఒక చిన్న బూడిద గుమ్మడికాయ
- 1-2 టేబుల్ స్పూన్ల తాజా నిమ్మరసం
- పుదీనా ఆకులు
- రుచికి తేనె లేదా చక్కెర
తయారు చేసే విధానం :
- బూడిద గుమ్మడికాయపై తొక్క, వాటిలోని విత్తనాలను తొలగించి దానిని చిన్న భాగాలుగా కట్ చేసుకోండి.
- బూడిద గుమ్మడికాయ ముక్కలను బ్లెండర్‌లో వేసి తిప్పండి.
- మెష్ స్ట్రైనర్ లేదా చీజ్ క్లాత్‌ను ఉపయోగించి, రసాన్ని వడకట్టి, గుజ్జును తీసేయండి.
- ఆ రసానికి సిట్రస్ కిక్ కోసం నిమ్మరసం జోడించుకోవచ్చు. రుచికి కోసం తేనె లేదా కాస్త చక్కెరను కలుపుకోవచ్చు.
- తాగడానికి ముందు రసాన్ని కొన్ని గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. తాగేటప్పుడు కొన్ని పుదీనా ఆకులను కలిపి తీసుకుంటే మంచిది.
బూడిద గుమ్మడికాయ రసం ప్రయోజనాలు :
- హైడ్రేషన్ :బూడిద గుమ్మడికాయ రసం హైడ్రేటింగ్ పానీయం. దాహాన్ని తీర్చడానికి, శరీరం హైడ్రేట్‌గా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.
- తక్కువ క్యాలరీలు :బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ రసం బాగా ఉపయోగపడుతుంది. బూడిద గుమ్మడికాయ రసంలో తక్కువ క్యాలరీలు, అధికంగా ఉండే నీటి శాతం బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
- పోషకాలు :బూడిద గుమ్మడికాయలో విటమిన్లు (C, B1, B3), ఖనిజాలు (కాల్షియం, ఫాస్పరస్), యాంటీ ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి.
- డైటరీ ఫైబర్స్ :బూడిద గుమ్మడికాయ రసం జీర్ణక్రియ మెరుగుపరచడం సహా జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
- శీతలీకరణ ప్రభావం :సాంప్రదాయ వైద్యంలో బూడిద పొట్లకాయ శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగిస్తుంది. శరీరంలోని వేడిని చల్లబరుస్తుంది.
- రక్తంలో చక్కెర నియంత్రణ :కొన్ని అధ్యయనాలు, బూడిద గుమ్మడికాయ హైపోగ్లైసీమిక్ ప్రభావాలను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
నిపుణులు ఈ రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలని సిఫారసు చేస్తున్నారు. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ రసంలో ఉండే పోషకాలను శరీరం గ్రహిస్తుందని సూచిస్తున్నారు.
కరక్కాయ హెల్త్ బెనిఫిట్స్ తెలుసా? జీర్ణం నుంచి దంతం వరకూ!
మీరు వంటల్లో జాజికాయను వాడారంటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్!