Belly Fat Loss: వయసు పెరుగుతున్న కొద్దీ చాలామందిలో పొట్ట పెరగటం చూస్తుంటాం. ఈ సమస్య మహిళల్లో అధికంగా కనిపిస్తుంటుంది. మరి చిన్నపాటి జాగ్రత్తలతో పొట్ట రాకుండా చూసుకోవచ్చని అంటున్నారు వైద్యులు. మరి అవేంటో తెలుసుకుందామా..?
పొట్టపెరగడానికి గల కారణాలు
- తినే ఆహారం
- జీవనశైలి
- కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం
- వ్యాయామం చేయకపోవడం
పొట్టలో కొవ్వు కరిగించే ఆహారం
- సంతృప్త కొవ్వులకు బదులు పాలీ అసంతృప్త కొవ్వులు ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.
- పాలిష్ బియ్యం, గోధుమలు, బ్రెడ్ కంటే సంక్లిష్ట పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
- కేలరీలను తక్కువగా తీసుకునేలా ఆహారాన్ని ఎంచుకోవాలి.
- వేపిన కూరగాయల కంటే ఆవిరిమీద ఉడికిన కూరగాయలు మేలు చేస్తాయి.
- పాలు, పెరుగు, మజ్జిగ, రాగులు తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి.
ఇదీ చూడండి:చాపకింద నీరులా 'కంటి చూపు' దొంగ.. చడీచప్పుడు లేకుండా!